ఫైనల్ బెర్తు కోసం ప్లాన్ ప్రకారమే ఇంగ్లాండ్ ఓడింది: ట్విట్టర్‌లో విమర్శలు

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ అంటేనే ప్రత్యేకం. టోర్నీలో బరిలోకి దిగే ప్రతి జట్టూ ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవాలనే కోరుకుంటుంది. కానీ, రష్యా వేదికగా గురువారం బెల్జియం-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇరు జట్లు గెలుపు కంటే కూడా ఓటమి కోసం ఎక్కువ శ్రమించాయని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
వివరాల్లోకి వెళితే.. ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఆడకమందే ఇంగ్లండ్, బెల్జియం జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. దీంతో గ్రూప్-జిలో అగ్రస్థానం కోసం ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం జట్టు 1-0తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన బెల్జియంతో పాటు రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ కూడా నాకౌట్‌లోకి అడుగుపెట్టాయి.

ఇంగ్లాండ్ ప్లాన్ ప్రకారమే ఓడింది
టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం గేమ్ ప్లాన్ ప్రకారమే ఓడిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి ఉంటే నాకౌట్‌లో జపాన్‌తో తలపడాల్సి ఉంటుంది. నాకౌట్‌లో జపాన్‌పై నెగ్గితే, క్వార్టర్ ఫైనల్‌లో బలమైన బ్రెజిల్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది.

బ్రెజిల్‌తో మ్యాచ్ తప్పించుకోవడానికే
ముందస్తు వ్యూహంలో భాగంగా బ్రెజిల్‌తో మ్యాచ్ తప్పించుకోవడానికి గాను బెల్జియంపై ఇంగ్లండ్ ఓడిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ జట్టును తెగ ట్రోల్ చేస్తున్నారు. అదే, బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు నాకౌట్‌లో కొలంబియాతో తలపడనుంది.
బ్రెజిల్‌తో పోలిస్తే స్వీడన్ లేదా స్విట్జర్లాండ్‌పై
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినట్లయితే మరో నాకౌట్ మ్యాచ్‌లో స్వీడన్, స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్‌తో పోలిస్తే స్వీడన్ లేదా స్విట్జర్లాండ్ జట్లపై ఇంగ్లాండ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయటంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

ఓటమికే మొగ్గు చూపిన ఇంగ్లాండ్ ప్లేయర్లు
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్కగోల్ కూడా నమోదు చేయలేదు. అంతేకాదు మైదానంలోకి దిగిన ఆటగాళ్లు సైతం ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించకుండా ఓటమికే మొగ్గు చూపారు. మ్యాచ్‌లో పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు కావాలని మిస్ చేశారు. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కోచ్ ఆటగాళ్లను అభినందిస్తూ స్వాగతం పలకడం ఇక్కడ చర్చనీయాంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications