ఫిఫా: ఫైనల్లో ఓడినా ఆటగాళ్లకు హగ్స్ ఇస్తూ సందడి చేసిన కోలిండా

హైదరాబాద్: రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులను ఆకట్టుకున్న వ్యక్తి క్రొయేషియా అధ్యక్షురాలు కోలిండా గ్రాబార్-కిటరోవిక్. ఫిఫా వరల్డ్ కప్‌లో తొలిసారి పైనల్‌కు చేరిన క్రొయేషియా జట్టుకు టోర్నీ ఆద్యంతం ఆమె మద్దుతుగా నిలిచారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
క్రొయేషియా జెర్సీని ధరించి లుజ్నిక్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి హాజరయ్యారు. ఫైనల్లో క్రొయేషియాను 4-2తేడాతో ఓడించి ఫ్రాన్స్ 2018 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి వరల్డ్‌కప్ విజేతా నిలుద్దామనుకున్న క్రొయేషియా ఆశలు ఆవిరయ్యాయి.
అయితేనేం, ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఆటగాళ్లను ఆమె ఓదార్చిన తీరు అద్భుతం. మ్యాచ్ అనంతరం జరిగిన ట్రోఫీ కార్యక్రమంలో ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్‌లతో కలిసి పాల్గొన్న క్రొయేషియా అధ్యక్షురాలు కోలిండా గ్రాబార్-కిటరోవిక్ ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లకు ఆమె అభినందనలు తెలుపుతూ హగ్స్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో కోలిండా ఫోటోలు వైరల్
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రొయేషియాకు చెందిన కోలిండా గ్రాబార్-కిటరోవిక్ క్రొయేషియన్‌తో పాటు ఇంగ్లీషు, స్పానిష్, పోర్చుగీస్ బాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అదే విధంగా జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ బాషలు కూడా వచ్చు. క్రొయేషియా జట్టు సెమీఫైనల్‌కు చేరినప్పటి నుంచి ఆదేశం మొత్తం ఆ జట్టు వెంట నడిచింది.

ఫైనల్లో క్రొయేషియా ఓడిపోయి ఉండొచ్చుగాక
వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియా ఓడిపోయి ఉండొచ్చుగాక.. కానీ రష్యా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆ జట్టు ఆట, వారి పోరాడని తీరు నిజంగా అద్భుతం. ఫైనల్లో కూడా క్రొయేషియా జట్టు ఫ్రాన్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లోని బాన్ జలసిక్ స్వేర్ వద్ద ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లపై మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. క్రొయేషియా జాతీయ జెండాలను పట్టుకుని సందడి చేశారు.

ట్రైన్ టికెట్లను 50 శాతం తగ్గింపు
చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌పై ఎంతో ఆసక్తిని కనబర్చారు. ఫైనల్ మ్యాచ్‌ని సాకర్ అభిమానులు వీక్షించేందుకు గాను ఉద్యోగస్తులకు ముందుగానే సెలవు ప్రకటించారు ఆ దేశ ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్. క్రొయేషియాలోని మిగతా పట్టాణాల నుంచి రాజధాని జాగ్రెబ్‌కు చేరుకునేందుకు వీలుగా ట్రైన్ టికెట్లను 50 శాతం వరకు తగ్గించారు.

నిరాశకు గురైన క్రొయేషియా అభిమానులు
అయితే ఈ మ్యాచ్‌లో 4-2తో ఫ్రాన్స్ చేతిలో క్రొయేషియా ఓడటంతో ఎంతో నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో క్రొయేషియా ఎక్కువ శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ స్వయం తప్పిదాలకు పాల్పడం ఆ జట్టు కొంప ముంచింది. అయితే ఈ ఓటమితో క్రొయేషియా జట్టు ప్రతిష్ట మసకబారలేదు.

ఓడినా హీరోలుగా నిలిచిన క్రొయేషియా ఆటగాళ్లు
సెల్ఫ్‌గోల్ చేసినందుకో లేదా పెనాల్టీ ఇచ్చినందుకు గాను ఆ దేశ ఆటగాళ్లు విలన్లు కాలేదు. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో క్రొయేషియా జట్టు ఈ స్థాయికి రావడమే గొప్ప విషయం. ఫైనల్ మ్యాచ్ కాగానే స్టేడియంలోని అభిమానులు లేచి నిలబడి క్రొయేషియా జట్టుకు అభినందనలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications