For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్‌ కప్: సలాహ్‌ లేకుండానే ఉరుగ్వేతో పోరుకు సిద్ధమైన ఈజిప్ట్

By Nageshwara Rao
Salah not in starting XI for Egypts World Cup opener

హైదరాబాద్: ఫిపా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఈజిప్ట్ జట్టు ఉరుగ్వేతో తలపడుతుంది. ఎకతెరీన్‌బెర్గ్‌ ఎరీనాలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మొహమ్మద్ సలాహ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. శుక్రవారం తన 26వ పుట్టినరోజుని జరుపుకున్న సలాహ్ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో అతడికి తుది జట్టులో చోటు లభించలేదు. సలాహ్ కొలుకున్నాడని, టోర్నీలో భాగంగా ఉరుగ్వేతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతాడని ఆ జట్టు ప్రధాన కోచ్ హెక్టర్ కూపర్ గురువారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో సలాహ్ ఉరుగ్వేతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతాడని అంతా భావించారు.

సలాహ్‌తో పాటు ఈజిప్ట్‌కు చెందిన 45 ఏళ్ల గోల్ కీపర్ ఎస్సామ్ ఎల్-హాడరీకి కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యధిక వయసు కలిగిన ఆటగాడు ఎస్సామ్ ఎల్-హాడరే కావడం విశేషం. కాగా, సలాహ్ ఛాంపియన్స్ లీగ్‌లో 44 గోల్స్‌తో ఈ సీజన్‌లో లివర్‌పూల్‌ తరపున సలా అద్భుత ప్రదర్శన చేశాడు.

ఫైనల్లో రియల్ మాడ్రిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో సలాహ్ భుజం గాయం కారణంగా కన్నీటితో మైదానాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత లివర్‌పూల్‌తో పోరాడిన రియల్ మాడ్రిడ్ ఓటమికి గురైంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్‌-ఎలో బరిలో నిలిచింది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు ఉంటాయి. ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది.

Story first published: Friday, June 15, 2018, 17:10 [IST]
Other articles published on Jun 15, 2018
Read in English: Salah left out of Egypt XI
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+