ఓటమితో వరల్డ్‌కప్ నిష్క్రమణ: అభిమానులను క్షమాపణ కోరిన సలాహ్

హైదరాబాద్: ఈజిప్ట్ అభిమానులకు ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహమ్మద్ సలాహ్ క్షమాపణలు చెప్పాడు. రష్యా వేదికగా జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈజిప్ట్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా సోమవారం గ్రూప్-ఏలో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో ఈజిప్ట్ ఓటమి పాలైంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్‌లో ఈజిప్టు స్టార్ ప్లేయర్ మహమ్మద్ సలాహ్ అద్భుతమైన గోల్‌తో రాణించినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ అనంతరం 26 ఏళ్ల సలాహ్ మాట్లాడుతూ "ఈజిప్ట్ అభిమానులను క్షమాపణలు కోరుతున్నా. ఇక్కడికి వచ్చి మూడు మ్యాచ్‌ల్లో మాకు మద్దతు తెలిపినందుకు. దీనిని ఎంతమాత్రం జీర్ణించుకోలేరు, మా లాగే. 28 ఏళ్ల తర్వాత ఈజిప్ట్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. కొంతమంది ఆటగాళ్లకు కావాల్సిన అనుభవం లేదు. మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. 2022లో మళ్లీ కలుద్దాం" అని అన్నాడు.

ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడి చేసిన మహమ్మద్ సలాహ్
టోర్నీలో భాగంగా ఈజిప్ట్ ఆడిన చివరి లీగ్ మ్యాచ్ ఆరంభం నుంచి మహమ్మద్ సలాహ్ వరుసగా ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడి చేశాడు. సలాహ్ ఆటతీరుతో స్టేడియంలోని ఈజిప్టు అభిమానుల కేరింతలుకొట్టారు. మ్యాచ్ 22వ నిమిషంలో సౌదీ గోల్‌కీపర్ యాసిర్ అలీ మొసాలెమ్‌ను బోల్తాకొట్టిస్తూ గోల్ కొట్టాడు. దీంతో ఈజిప్ట్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

రెండో పెనాల్టీని ఆపలేకపోయిన ఈజిప్టు గోల్‌కీపర్
ఆ తర్వాత తొలిపెనాల్టీని ఆపిన ఈజిప్టు గోల్‌కీపర్ తొలి అర్ధభాగం ఇంజ్యూరీ సమయంలో సౌదీకి లభించిన రెండో పెనాల్టీని మాత్రం ఆపలేకపోయాడు. ఎంతో ఒత్తిడితో కూడిన ఆ సమయంలో సౌదీ ఫుట్‌బాలర్ సాల్మన్ అల్‌ఫర్జా పెనాల్టీని గోల్‌గా మలిచి 1-1తో స్కోరు సమం చేశాడు. ఇక రెండో అర్ధభాగంలోనూ రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో స్వదేశం చేరాలన్న లక్ష్యంతో రెండుజట్లూ అద్భుతంగా పోరాడాయి.

ఇంజ్యూరి సమయంలో గోల్ కొట్టిన సలీమ్ అల్దాస్రి
మ్యాచ్ చివరకు డ్రా దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అనుకున్నట్లే రెండో అర్ధభాగం ముగిసినా గోల్ నమోదు కాలేదు. అయితే, ఇంజ్యూరి సమయం (90+6)లో సౌదీ ఆటగాడు సలీమ్ అల్దాస్రి గోల్ కొట్టాడు. దీంతో ఈజిప్ట్‌పై సౌదీ అరేబియా 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సౌదీ అరేబియా ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా... ఈజిప్ట్ ఆటగాళ్లు మాత్రం నిరాశగా మైదానాన్ని వీడారు.

అత్యధిక వయసు ఉన్న ఫుట్‌బాలర్‌గా ఎస్సామ్ అల్ హదరీ
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్‌లో అత్యధిక వయసు ఉన్న ఫుట్‌బాలర్‌గా ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎస్సామ్ అల్ హదరీ (45 ఏండ్ల 165 రోజులు) రికార్డు నెలకొల్పాడు. గతంలో కొలంబియా గోల్‌కీపర్ ఫారీ మోండ్రోగాన్ (43 ఏళ్ల 3 రోజులు)వయసులో 2014 ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications