మ్యాచ్ మధ్యలో ఫుట్‌బాలర్ పాడు పని..!(వీడియో)
పెరూలోని ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ చేసిన ఘనకార్యం తీవ్ర చర్చనీయాంశమైంది. అతనిపై వేటు వేసేలా చేసింది. పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో భాగంగా అట్లెటికో అవాజున్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సెబాస్టియన్ మునోజ్.. మైదానం పక్కనే మూత్ర విసర్జన చేశాడు. దాంతో రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి మైదానం బయటకు పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఆ ఫుట్‌బాలర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంటోర్సిల్లో ఎఫ్‌సీ వర్సెస్ అట్లెటికో జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గోల్ కీపర్ లూచో రూయిజ్ గాయపడటంతో మ్యాచ్‌ను నిలిపేసారు. ఓవైపు రూయిజ్‌కు వైద్య చికిత్స్ అందిస్తుండగా.. మరోవైపు సెబాస్టియన్ ఓ పక్కకు వెళ్లి మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని ప్రత్యర్థి ఆటగాళ్లు రిఫరీకి తెలియజేయగా.. అతనికి రెడ్ కార్డ్ జారీ చేశారు.

ఈ సందర్భంగా వారి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో మునోజ్ మైదానం బయటకు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. అయితే ఇలా మైదానం పక్కనే ఫుట్‌బాల్ ప్లేయర్లు మూత్ర విసర్జన చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా మంది ఇలానే చేసి విమర్శలపాలయ్యారు. పొట్ట ఉబ్బరంతో ఇంగ్లండ్ మాజీ గోల్‌కీపర్ లినెకర్ కూడా ఇలానే మైదానం పక్కనే మూత్ర విసర్జన చేశాడు.
𝐄𝐥 𝐟𝐮́𝐭𝐛𝐨𝐥 𝐬𝐮𝐝𝐚𝐦𝐞𝐫𝐢𝐜𝐚𝐧𝐨 𝐧𝐮𝐧𝐜𝐚 𝐝𝐞𝐣𝐚𝐫𝐚́ 𝐝𝐞 𝐬𝐨𝐫𝐩𝐫𝐞𝐧𝐝𝐞𝐫
— Miguel Ángel García (@Miguelin_24_) August 18, 2024
🇵🇪 Cantorcillo vs Atlético Awajun de Copa Perú
🚽 Sebastián Muñoz (Atlético Awajun) es expulsado ¡¡por ponerse a orinar en el saque de esquina en pleno partido!! pic.twitter.com/Blve6VFIGS
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications