న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫైనల్లో విచిత్ర ఘటన: ఆటకు అంతరాయం, లేడీ అభిమానికి ఎంబాపే హైఫై

By Nageshwara Rao
Pussy Riot protesters interrupt World Cup final, high-five Kylian Mbappe

హైదరాబాద్: మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఫ్రాన్స్‌-క్రోయేషియా జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యా‌చ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తొలి అర్ధభాగం రసవత్తరంగా సాగింది. ఆరంభం నుంచీ క్రొయేషియాదే పైచేయి.

Pussy Riot protesters interrupt World Cup final, high-five Kylian Mbappe

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో తొలి 15 నిమిషాల పాటు ఫ్రాన్స్‌కు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న ఆ జట్టు.. దూకుడైన ఆటతో పదే పదే ఫ్రాన్స్‌ గోల్ పోస్టువైపుకి దూసుకెళ్లింది. మంచి జోష్‌లో కనిపించిన క్రొయేషియా అదే జోరులో చేసిన పొరపాటు ఫ్రెంచ్‌ జట్టుకు కలిసొచ్చింది.

18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మంజుకిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ కొట్టాడు. గ్రీజ్‌మన్‌ ఫ్రీకిక్‌ను అతడు దూరంగా కొట్టబోగా.. బంతి సొంత నెట్లోనే పడింది. ప్రపంచ కప్‌ ఫైనల్లో నమోదైన తొలి సెల్ఫ్‌ గోల్‌ ఇదే కావడం విశేషం. కానీ వెనుకబడడం క్రొయేషియాకు కొత్తేమీ కాదు. టోర్నీలో నాకౌట్‌ మ్యాచ్‌లన్నింటిలోనూ ఇలాగే వెనుకబడ్డా పుంజుకుంది.

కొద్దిసేపటికే పెరిసిచ్‌ గోల్‌ చేసి క్రొయేషియా ఆశలకు ఊపిరి పోశాడు. ఆధిపత్యాన్ని ప్రదర్శించినా సెల్ఫ్ గోల్‌ ఇవ్వడంతో నిరాశపరిచినా.. క్రొయేషియా త్వరగానే తేరుకుంది. ఎదురుదాడిని తీవ్రం చేస్తూ పదేపదే ఫ్రాన్స్‌ బాక్స్‌లోకి దూసుకెళ్లి.. ఓ పది నిమిషాల్లోనే ఫలితం రాబట్టింది. పెరిసిచ్‌ ఓ కళ్లు చెదిరే గోల్‌తో స్కోరు సమం చేశాడు.

ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న క్రమంలో మ్యాచ్‌ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు.

1
958085

అంతటితో ఆగకుండా అభిమాన ఆటగాళ్లకు హైఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఓ మహిళా అభిమానికి ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఎంబాపే హైఫై ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతనిపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరోవైపు ఎంబాపే అక్రమంగా మైదానంలోకి వచ్చిన అభిమానికి హైఫై ఇస్తే.. క్రొయేషియా ఢిఫెండర్‌ డేజన్‌ లోవెరన్‌ ఆ ప్రేక్షకులను పట్టుకోని సెక్యూరిటి సిబ్బందికి అప్పగించాడు. ఎంబాపెను ప్రశంసిస్తున్న అభిమానులు.. డేజన్‌ లోవెరన్‌పై మండిపడుతున్నారు. కాగా, మైదానంలోకి దూసుకొచ్చిన ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా విజయంతో ఫ్రాన్స్‌ రెండోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. 2018 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ ఓడకుండా ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2తేడాతో విజయం సాధించింది. క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని), పోగ్బా (59వ ని), ఎంబాపె (65వ ని) ఫ్రాన్స్ తరఫున గోల్స్‌ సాధించారు.

క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని), మాన్‌జుకిచ్‌ (69వ ని) గోల్స్‌ సాధించారు. 1970 (బ్రెజిల్‌) తర్వాత ఫైనల్లో 4 గోల్స్‌ కొట్టిన తొలి జట్టుగా ఫ్రాన్స్‌ నిలిచింది. 2002 నుంచి నాలుగు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్‌ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్‌ నమోదయ్యాయి. 1958 ఫైనల్‌ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్‌ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి.

Story first published: Monday, July 16, 2018, 14:26 [IST]
Other articles published on Jul 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X