Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026‌లో బెట్టింగ్ జోరు.. మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ మ్యాచ్‌ల విషయంలో బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రెడిక్షన్ మార్కెట్ వేదికల ద్వారా బిలియర్ల కొద్దీ డాలర్లు చేతులు మారుతుండటంతో ఫుట్‌బాల్ నైతికతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంచనాల కారణంగా జట్ల అంతర్గత సమాచారం బహిర్గతమవ్వడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నార్వే సంచలన విజయం.. బ్రెజిల్ ఔట్! వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్‌మార్!

నార్వే సంచలన విజయం.. బ్రెజిల్ ఔట్! వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్‌మార్!

కోట్ల రూపాయల వ్యాపారంగా బెట్టింగ్..

కాల్షి, పాలీమార్కెట్ వంటి వేదికలు క్రీడా బెట్టింగ్‌ను ఒక సాధారణ జూదంగా కాకుండా.. పెద్ద ఎత్తున జరిగే 'ఫైనాన్స్ ట్రేడింగ్'గా ప్రచారం చేస్తున్నాయి. సాంప్రదాయ బుక్‌మేకర్లలా కాకుండా.. ఇక్కడ పందెం కాసేవారు ఒకరితో ఒకరు పోటీపడతారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా బెట్టింగ్ రేట్లు మారుతుంటాయి. కేవలం ఒక్కో హై-ప్రొఫైల్ మ్యాచ్‌పైనే 100 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ జరుగుతుండగా.. మొత్తం ప్రపంచకప్ ట్రేడింగ్ వాల్యూమ్ ఇప్పటికే 5.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 46,000 కోట్లు) దాటినట్లు కాల్షి సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Prediction Market Boom at FIFA World Cup 2026 Sparks Severe Match-Fixing and Integrity Concerns

ఫిఫా ద్వంద్వ విధానంపై విమర్శలు..

మరోవైపు.. ఫిఫా 'ఏడీఐ ప్రిడిక్ట్‌స్ట్రీట్'అనే ప్రెడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌తో దాదాపు 150 మిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదర్చుకోవడం వివాదాస్పదంగా మారింది. ఫుట్‌బాల్ ప్లేయర్స్, అధికారులు, ఏజెంట్లు ఎలాంటి బెట్టింగ్‌లకు పాల్పడకూడదని, బెట్టింగ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోకూడదని ఫిఫా నైతిక నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఫిఫానే స్వయంగా ఇలాంటి సంస్థతో చేతులు కలపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ ఒక్క ఓవరే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

ఆ ఒక్క ఓవరే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

ముంచుకొస్తున్న ముప్పు..

సాంప్రదాయ బెట్టింగ్ కంటే ఈ ప్రెడిక్షన్ మార్కెట్లు వేగంగా స్పందిస్తాయి. దాంతో ఆటగాళ్ల గాయాలు, వ్యూహాలు వంటి జట్టులోని కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. చట్టబద్ధమైన నిబంధనలు లేని గ్రే-జోన్‌లో ఇవి నడుస్తుండటంతో.. మార్కెట్ మానిపులేషన్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇవి కేరాఫ్ అడ్రస్‌గా మారే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, July 6, 2026, 10:21 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+