Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలుపు తిప్పిన రొనాల్డో, రామోస్.. ఉత్కంఠ పోరులో గట్టెక్కిన పోర్చుగల్!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో క్రిస్టియన్ రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ తమ జోరును కొనసాగిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ పోరులో పోర్చుగల్ 2-1 తేడాతో క్రొయేషియాను ఓడించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో క్రిస్టియన్ రొనాల్డో, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గొన్సాలో రామోస్ అద్భుతమైన గోల్స్‌తో పోర్చుగల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో పోర్చుగల్ ప్రి-క్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. క్రొయేషియా ఇంటి బాట పట్టింది. ప్రి-క్వార్టర్స్‌లో స్పెయిన్‌తో పోర్చుగల్ అమీతుమీ తేల్చుకోనుంది.

ఫస్టాఫ్‌లో ఇరు జట్లు హోరాహోరీ తలపడటంతో గోల్స్ నమోదు కాలేదు. అయితే సెకండాఫ్ ప్రారంభమైన కాసేపటికే 53వ నిమిషంలో ఇవాన్ పెరిసిచ్ అద్భుతమైన లో-షాట్‌తో క్రొయేషియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. వరల్డ్ కప్‌ల్లో పెరిసిచ్‌కు ఇది 7వ గోల్. దాంతో అతను దావర్ సుకర్ (6 గోల్స్)ను అధిగమించి, ప్రపంచకప్‌లో క్రొయేషియా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

తొలి ఆటగాడిగా రొనాల్డో..

ఆ తర్వాత క్రొయేషియా కొట్టిన మరో గోల్‌ను అంపైర్ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో 68వ నిమిషంలో పోర్చుగల్‌కు లభించిన పెనాల్టీని కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. 41 ఏళ్ల వయసులో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. అలాగే 9 నాకౌట్ మ్యాచ్‌ల్లో అతనికి ఇదే తొలి గోల్ కావడం విశేషం.

Portugal 2-1 Croatia Ramos Snatches Dramatic Late Winner to Set Up Spain Clash

మ్యాచ్ ముగుస్తుందనగా.. 94వ నిమిషంలో (93:09) రాఫెల్ లియావో అందించిన క్రాస్‌ను గొన్సాలో రామోస్ హెడర్ ద్వారా గోల్ పోస్ట్‌లోకి పంపి పోర్చుగల్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. చివరి నిమిషంలో (90+13వ నిమిషం) క్రొయేషియా డిఫెండర్ జోస్కో గార్డియోల్ బంతిని నెట్‌లోకి పంపినప్పటికీ, VAR సమీక్షలో అది ఆఫ్‌సైడ్‌గా తేలడంతో క్రొయేషియా ఓటమి ఖరారైంది.

మోడ్రిచ్‌కు వీడ్కోలు.. జోటాకు నివాళి..

ఈ ఓటమితో క్రొయేషియా దిగ్గజం లూకా మోడ్రిచ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లయింది. మరోవైపు, దివంగత సహచర ఆటగాడు డియోగో జోటా ప్రథమ వర్ధంతి సందర్భంగా పోర్చుగల్ జట్టు ఈ విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం రొనాల్డో ఈ గెలుపును జోటాకు అంకితం ఇచ్చాడు.

Story first published: Friday, July 3, 2026, 8:45 [IST]
Other articles published on Jul 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+