Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీడల వల్లే పిజ్జా, బీర్ల అమ్మకాలు పెరిగిపోతున్నయ్..!!

PIzza and Beer

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి క్రీడలకు ఆదరణ మారుతూంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయా దేశాలు ప్రాతినిధ్యం వహించని పోటీల్లోనూ.. ఆ దేశస్థులు విపరీతమైన అభిమానం పెంచుకోవటం చూస్తూనే ఉంటాం. ఇలాగే ఫుట్‌బాల్ గేమ్‌కు విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది పిచ్చెక్కిపోతుంటారు. ఇక తర్వాతి వరుసలో క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌ బాల్, హాకీ తదితర క్రీడలకు ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మెగా టోర్నీలు జరుగుతుంటే, ఇళ్లలోనూ.. రోడ్లపైనా ఎక్కడపడితే అక్కడ టీవీల ముందు అతుక్కుపోయి కనిపిస్తుంటారు జనం. ఇక రెస్టారెంట్లు, బార్లలో అయితే మ్యాచ్‌లు చూస్తూ.. ఎంత తింటున్నారో కూడా తెలియదు. ఇలా భారత్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన ఐపీఎల్‌కు అభిమానంతో వెర్రెక్కిన జనం తాగుతూ.. మ్యాచ్‌లు చూశారట. ఇలా చూస్తూ.. మద్యం భారీగానే సేవించారట. రెండు వారాల వ్యవధిలోనే ఫిఫా వరల్డ్ కప్ మొదలై.. క్రీడా ఔత్సాహికులకు కనువిందు చేస్తుంది.

ఐతే భారత్‌లో క్రికెట్‌కు అత్యధిక స్థాయిలో అభిమానులున్నారు. ఈ మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు పిజ్జాలు.. బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని ఒక సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ జరిగినప్పటి కన్నా ఫిఫా ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో ఫుడ్, బేవరేజెస్ కంపెనీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఫిఫా టోర్నీ ఆరంభమై కేవలం రెండు వారాలు మాత్రమే పూర్తయినప్పటికీ భారత్‌లో పిజ్జాలు, బీర్ల కంపెనీల రేటింగ్ విపరీతంగా పెరగడంతో విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Pizza, beer emerge winners in India as FIFA World Cup follows cricket

లాంగ్ స్పోర్ట్స్ సీజన్లలో పిజ్జాలు, ఆల్కహాలిక్ బేవరేజెస్ అమ్మకాలు పెరిగాయని పీఆర్‌బీ సెక్యూరిటీస్ లిమిటెడ్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. భారత్‌లో అధిక వేతనాన్ని పొందుతున్న యువత ఒక దగ్గర చేరి మద్యం సేవించడానికి, ఫాస్ట్‌ఫుడ్‌ను తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ రోజుల కంటే మ్యాచ్‌లు జరిగిన రోజుల్లో రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయని ఆయన చెప్పారు. ఏప్రిల్ నుంచి యునైటెడ్ బ్రూవరీస్ 25శాతం వృద్ధి సాధించి, జూన్ 12న ఆల్‌టైం హైకి చేరుకుంది. క్రీడా అభిమానుల వల్లే పిజ్జా, బీర్ భారత్‌లో విజేతలుగా నిలిచాయి.

Story first published: Friday, June 29, 2018, 10:51 [IST]
Other articles published on Jun 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+