Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026 ఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్ ఖేల్‌ఖతమ్!

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు స్పెయిన్ దూసుకెళ్లింది. మంగళవారం అర్దరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో అద్వితీయమైన ప్రదర్శనతో స్పెయిన్ 2-0తో ఫ్రాన్స్‌ను మట్టికరపించింది. మికెల్ ఒయర్జ్‌బల్(22వ నిమిషం), పెడ్రో పొరో(58వ నిమిషం) గోల్స్ నమోదు చేసి స్పెయిన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే స్పెయిన్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ అందుకున్న స్పెయిన్ ఆ తర్వాత కనసీం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. 2014లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆ జట్టు.. 2018, 2022లో నాకౌట్ దాటలేకపోయింది.

స్పెయిన్ టికి-టాకా వ్యూహం ఏంటి? సెమీఫైనల్లో ఫ్రాన్స్‌‌తో ఢీ!

స్పెయిన్ టికి-టాకా వ్యూహం ఏంటి? సెమీఫైనల్లో ఫ్రాన్స్‌‌తో ఢీ!

ఈ సారి మాత్రం అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. రెండు విజయాలు, డ్రాతో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించిన స్పెయిన్.. నాకౌట్‌లో ఆస్ట్రియా, పోర్చుగల్‌పై గెలుపొందింది. క్వార్టర్స్‌లో బెల్జియంను ఓడించింది.

Pedro Porro and Mikel Oyarzabal Fire Spain beat France to Reach First World Cup Final Since 2010

టికి-టాకా వ్యూహంతో..

మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. తమ టికి-టాకా వ్యూహంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. 8వ నిమిషంలోనే స్పెయిన్‌కు గోల్ చేసే అవకాశం దక్కింది. కానీ బంతి గోల్‌పోస్ట్ వాల్‌ను తాకి కొద్దిలో మిస్సైంది.

22వ నిమిషంలో టీనేజ్ సెన్సేషన్ మికెల్ ఒయర్జ్‌బల్ పెనాల్టీ ద్వారా గోల్ సాధించి స్పెయిన్‌కు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. స్పెయిన్ దూకుడుతో ఫ్రాన్స్ పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే గోల్ అవకాశాలను సృష్టించలేకపోయాడు. స్పెయిన్ డిఫెన్స్‌ విభాన్ని ఛేదించలేకపోయాడు.

ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ షెడ్యూల్ వచ్చేసింది.. మెస్సీ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ షెడ్యూల్ వచ్చేసింది.. మెస్సీ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

పొరో గోల్.. ఎంబాపే ఫ్రస్టేషన్..

సెకండాఫ్‌లోనూ స్పెయిన్ తమ జోరును కొనసాగించింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ఫ్రాన్స్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. 58వ నిమిషంలో ఊహించని విధంగా స్పెయిన్ తమ ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. రైట్ బ్యాక్ పెడ్రో పొరో అనూహ్యంగా ముందుకు దూసుకెళ్లి ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఈ గోల్‌తో ఫ్రాన్స్ మరింత ఒత్తిడికి లోనైంది.

సహనం కోల్పోయిన ఎంబాపే 85వ నిమిషంలో ఎల్లో కార్డ్ హెచ్చరిక కూడా గురయ్యాడు. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న స్పెయిన్.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ ఫైట్‌లో అర్జెంటీనా లేదా ఇంగ్లండ్‌తో స్పెయిన్ తలపడనుంది.

Story first published: Wednesday, July 15, 2026, 7:42 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+