లండన్ నుంచి రష్యాకు: పోగ్బా కొత్త హెయిర్ స్టైల్ చూశారా?

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ సాకర్ అభిమానులను ఎంతగానో ఆలరిస్తోంది. స్టార్ ప్లేయర్లే కాదు సాధారణ ఆటగాళ్లు సైతం అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇక, స్టార్ ప్లేయర్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. కళ్లు చెదిరే గోల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తున్నారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆకట్టుకుంటున్న ఆటగాళ్లు హెయిర్ స్టైల్స్
మరోవైపు తక్కువ ర్యాంకులో ఉన్న జట్లు ర్యాంకింగ్స్‌లో తమకన్నా మెరుగైన స్థానంలో ఉన్న జట్లకు షాకిస్తున్నాయి. మరికొన్ని హోరాహోరీగా పోరాడి డ్రాగా ముగిస్తున్నాయి. టోర్నీలో భాగంగా ఆటగాళ్లకు చెందిన హెయిర్ స్టైల్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

2400 కిలోమీటర్లు ప్రయాణించిన బార్బర్
ఈ క్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా హెయిర్ కట్ కోసం ఓ బార్బర్ 2400 కిలోమీటర్లు ప్రయాణించాడు. వివరాల్లోకి వెళితే... గత కొన్నేళ్లుగా పాల్ పోగ్బా లండన్‌కు చెందిన బార్బర్ అహ్మద్ అల్సానవి వద్ద హెయిర్ కట్ చేయించుకున్నాడు.

రష్యాలో ఉన్న పాల్ పోగ్బా
అయితే, ప్రస్తుతం వరల్డ్ కప్ నిమిత్తం రష్యాలో ఉన్న పాల్ పోగ్బా తన హెయిర్ కట్ కోసం వ్యక్తిగత బార్బర్ అహ్మద్ అల్సానవిని లండన్ నుంచి రష్యాకు రప్పించాడు. 18 గంటలపాటు ప్రయాణించి వచ్చిన అల్సానవితో హెయిర్ కట్ చేయించుకోవడానికి మిగతా ఫ్రాన్స్ ఆటగాళ్లు కూడా క్యూ కట్టారు.
పోగ్బా, బెంజిమన్ మెండీ నా క్లయింట్‌లు
"పోగ్బా, బెంజిమన్ మెండీ నా క్లయింట్‌లు. కానీ మిగతా ఫ్రెంచ్ ప్లేయర్లకు కూడా నేను తెలుసు. నేను వస్తున్నానని తెలిసి వారు కూడా హెయిర్ స్టయిల్ చేయించుకోవాలనుకున్నారు" అని అహ్మద్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications