Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరాగ్వే సంచలన విజయం.. మాజీ ఛాంపియన్ జర్మనీ షూటౌట్

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మరో సంచలన ఫలితం నమోదైంది. మాజీ ఛాంపియన్ జర్మనీకి పరాగ్వే షాకిచ్చింది. మంగళవారం తెల్లవారుజామున తీవ్ర ఉత్కంరగా సాగిన ప్రి-క్వార్టర్స్ మ్యాచ్‌లో జర్మనీని పరాగ్వే షూటౌట్ చేసింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరు జట్లు సమంగా నిలవడంతో షూటౌట్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే 4-3తో జర్మనీపై చారిత్రాత్మక విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మరోవైపు నాలుగు సార్లు ఛాంపియన్ అయిన జర్మనీ ఇంటిబాట పట్టింది.

ఫిఫా నాకౌట్స్‌కు బుల్లి దేశం.. మట్టికరిచిన మాజీ ఛాంపియన్!

ఫిఫా నాకౌట్స్‌కు బుల్లి దేశం.. మట్టికరిచిన మాజీ ఛాంపియన్!


ఫస్టాఫ్‌లో పరాగ్వే జోరు

మ్యాచ్ ఆరంభం నుంచే పరాగ్వే దూకుడుగా ఆడింది. ఆట 42వ నిమిషంలో మథియాస్ గలార్జా అందించిన అద్భుత పాస్‌ను జూలియో ఎన్సిసో హెడర్ ద్వారా గోల్‌గా మలిచి పరాగ్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచకప్ నాకౌట్ దశలో పరాగ్వేకు ఇదే తొలి గోల్ కావడం విశేషం. జర్మనీ ఆటగాళ్లు తొలి హాఫ్‌లో పూర్తిగా నిరాశపరిచారు.

Paraguay Stuns Germany in Historic FIFA World Cup 2026 Shootout Triumph

పుంజుకున్న జర్మనీ.. వివాదాస్పద నిర్ణయం

సెకండాఫ్‌లో జర్మనీ వ్యూహాలు మార్చింది. ఫ్లోరియన్ విర్ట్జ్ అందించిన క్రాస్‌ను కై హ్యావర్ట్జ్ హెడర్ ద్వారా గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌లో జర్మనీ డిఫెండర్ జోనాథన్ తాహ్ హెడర్ ద్వారా గోల్ కొట్టినప్పటికీ, వీఏఆర్ (VAR) సమీక్షలో రిఫరీ దాన్ని ఫౌల్‌గా ప్రకటించి రద్దు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

పిచ్ పక్కన ఉన్న మానిటర్‌లో రీప్లేను పరిశీలించిన మొరాకో రెఫరీ జలాల్ జాయే... తాహ్ హెడర్ కొట్టడానికి ముందే జర్మనీ డిఫెండర్ వాల్డెమార్ ఆంటన్, పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్‌ను రూల్స్‌కు విరుద్దంగా అడ్డుకున్నాడని తేల్చాడు. ఆ ఫౌల్ కారణంగా ఆ గోల్‌ను రద్దు చేయడంతో.. మ్యాచ్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లే సువర్ణావకాశాన్ని జర్మనీ చేజార్చుకుంది. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

షూటౌట్‌లో నరాలు తెగే ఉత్కంఠ

పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. జర్మనీ ఆటగాళ్లు హ్యావర్ట్జ్, వోల్టెమేడ్ కొట్టిన షాట్లను అతడు అడ్డుకున్నాడు. చివరిగా జర్మనీ ఆటగాడు జోనాథన్ తాహ్ పెనాల్టీని మిస్ చేయగా, పరాగ్వే డిఫెండర్ జోస్ కెనాల్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

FIFA WC 2026: మెస్సీ రికార్డుల సునామీ: జోర్డాన్‌పై అర్జెంటీనా ఘన విజయం!

FIFA WC 2026: మెస్సీ రికార్డుల సునామీ: జోర్డాన్‌పై అర్జెంటీనా ఘన విజయం!

జర్మనీకి వరుసగా మూడోసారి నిరాశ

ప్రపంచకప్ చరిత్రలో పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ ఓడిపోవడం ఇదే తొలిసారి. వరుసగా మూడో ప్రపంచకప్‌లోనూ జర్మనీ కనీసం క్వార్టర్స్ చేరకుండానే నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోచ్ నాగెల్స్‌మన్ ఎంపిక చేసిన వ్యూహాలు, ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే జర్మనీ కొంపముంచాయి. కాగా, సంచలన విజయంతో ముందంజ వేసిన పరాగ్వే క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ లేదా స్వీడన్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, June 30, 2026, 9:34 [IST]
Other articles published on Jun 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+