న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ISL 2020-21: ముంబైకి షాక్.. నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ శుభారంభం!

NorthEast United beats Mumbai City in ISL 2020-21

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఏడో సీజన్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) శుభారంభం చేసింది. తిలక్‌ మైదాన్‌ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ 1-0తో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌పై విజయం సాధించింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్‌గా మలిచిన స్ట్రయికర్‌ అపియా నార్త్‌ఈస్ట్‌కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్‌ను ఆరంభించింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచే ముంబై దూకుడు ప్రదర్శించింది. బంతిని అధికభాగం తన అధీనంలో ఉంచుకుంది. కానీ అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచలేకపోయింది. ముఖ్యంగా అహ్మద్‌ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో మైదానంలో పరుగెడుతూ.. నార్త్‌ఈస్ట్‌పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్‌ చేయడంలో సఫలం కాలేకపోయారు. మరోవైపు నార్త్‌ఈస్ట్‌ రక్షణశ్రేణి ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.

ప్రథమార్థం రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా.. ముంబై సిటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి ఆటగాడు ఖాసా కమరాను మొరటుగా అడ్డుకోవడంతో ముంబై కీలక మిడ్‌ఫీల్డర్‌ అహ్మద్‌ జాహు రెడ్‌కార్డ్‌తో మైదానం వీడాల్సి వచ్చింది. దాంతో ముంబై జట్టు పదిమందికే పరిమితమైంది.

రెండో అర్ధ భాగంలో నార్త్‌ఈస్ట్‌ విజృంభించింది. ఈ క్రమంలో 49వ నిమిషంలో లభించిన పెనాల్టీని అపియా పొరపాటు లేకుండా గోల్‌పో్‌స్టలోకి పంపి నార్త్‌ఈ్‌స్టను ఆధిక్యంలో నిలిపాడు. ఇక జాహు లేకపోవడంతో ముంబై మిడ్‌ఫీల్డ్‌ చేష్టలుడిగింది. ఇదే అదనుగా నార్త్‌ఈస్ట్‌ దాడులకు పదును పెంచింది. ఆపై ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతుంది.

2019 ప్రపంచకప్‌కు రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పే: మాజీ సెలెక్టర్2019 ప్రపంచకప్‌కు రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పే: మాజీ సెలెక్టర్

Story first published: Sunday, November 22, 2020, 9:51 [IST]
Other articles published on Nov 22, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X