Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: నోరా ఫతేహి రెడ్ హాట్ పర్ఫార్మెన్స్.. దద్దరిల్లిన స్టేడియం!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి దుమ్మురేపింది. రెడ్ హాట్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఈ టోర్నీ అఫిషియల్ సాంగ్స్‌లో ఒకటైన 'సిర్ సిర్' పాటకు నోరా ఫతేహి అద్భుతమైన డ్యాన్స్‌తో టొరంటో స్టేడియాన్ని హోరెత్తించింది.

వాస్తవానికి ఫిఫా ప్రపంచకప్ గత గురువారమే ప్రారంభమైనా.. ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న మూడు దేశాల్లో ప్రారంభోత్సవ వేడుకుల నిర్వహించారు. ఇందులో భాగంగా కెనడా ప్రారంభోత్సవ వేడుకలు టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Nora Fatehi and Vegedream Ignite FIFA World Cup 2026 Canada Opening Ceremony in Toronto
Photo Credit: X (twitter)

ఫ్రెంచ్ ఆర్టిస్ట్ వెజెడ్రీమ్, బంగ్లాదేశ్-అమెరికన్ డీజే సంజోయ్‌తో కలిసి ఆమె చేసిన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొరాకో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఉపయోగించే 'గో, గో' అనే నినాదం స్ఫూర్తితో ఈ పాటను రూపొందించారు. అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల కలయికతో రూపొందిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏకం చేసేలా ఉందని నిర్వాహకులు తెలిపారు.

FIFA WC 2026: మెక్సికో విజయం! లేడీ ఫ్యాన్ రచ్చ..ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా..!(వీడియో)

FIFA WC 2026: మెక్సికో విజయం! లేడీ ఫ్యాన్ రచ్చ..ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా..!(వీడియో)

టొరంటోలోనే పుట్టి పెరిగిన నోరా ఫతేహి.. తన సొంత నగరంలో ప్రపంచ వేదికపై ప్రదర్శన ఇవ్వడం గమనార్హం. ఇది తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. 22 ఏళ్ల వయసులో కెరీర్ కోసం భారత్‌కు వచ్చిన నోరా, బాలీవుడ్‌లో అగ్రతారగా గుర్తింపు పొందింది. గతంలో 2022 ఖతార్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లోనూ ఆమె అద్భుత ప్రదర్శన ఇచ్చింది.

కెనడా, బోస్నియా హెర్జెగోవినా జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ వేడుకల్లో అలనిస్ మోరిసెట్, అలెసియా కారా, మైఖేల్ బూబ్లే వంటి పలువురు అంతర్జాతీయ కళాకారులు కూడా ఆడి పాడారు. మెక్సికోలో జరిగిన వేడుకల్లో షకీరా, బర్నా బాయ్ వంటి స్టార్లు ప్రదర్శన ఇచ్చారు. నోరా ఫతేహి ప్రదర్శనకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది.

FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన అమెరికా.. పరాగ్వేపై ఘన విజయం!

FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన అమెరికా.. పరాగ్వేపై ఘన విజయం!
Story first published: Saturday, June 13, 2026, 17:59 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+