సెక్స్‌పై నిషేధం లేదు: ఐస్ ల్యాండ్ జట్టు కోచ్, ఆటగాళ్లకు షరతు

హైదరాబాద్: రష్యా వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ సాకర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు, అభిమానులు రష్యా చేరుకున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లంతా తమ దృష్టిని ఈ మెగా టోర్నీపైనే కేంద్రీకరించారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఫుట్‌బాల్ ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనాలా?
అయితే, నెల రోజుల పాటు జరిగే టోర్నీ కావడంతో వరల్డ్ కప్ సమయంలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనాలా.. లేదా.. అన్న విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వరల్డ్ కప్ సమయంలో ఆటగాళ్లు శృంగార కార్యకలాపాలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

నిషేధం విధించిన జర్మనీ కోచ్ జోకిమ్ లో
వరల్డ్ కప్ ముందు జర్మనీ కోచ్ జోకిమ్ లో ఆటగాళ్లు సెక్స్‌లో పాల్గొనడంపై నిషేధం విధించాడు. వరల్డ్ కప్ సమయంలో ఆటగాళ్లెవరూ శృంగారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశాడు. ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోకిమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

శృంగారంలో పాల్గొనాలంటే షరతు
అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఎక్కువ సమయం గడపొద్దని కూడా ఆదేశించాడు. అయితే, ఐస్‌లాండ్ కోచ్ హల్ గ్రిమన్స్ మాత్రం తమ ఆటగాళ్లపై ఇలాంటి నిషేధాలు ఏమీ లేవని తెలిపాడు. ప్రపంచకప్ సమయంలో ఆటగాళ్లు భార్యలతో మాత్రమే శృంగారంలో పాల్గొనే షరతు పెట్టాడు.

సెక్స్ నిషేధం ఏమైనా విధించారా?
జట్టు సభ్యుల సెక్స్ నిషేధం ఏమైనా విధించారా? అని ఓ ఐస్‌లాండ్ విలేకరి అడిగిన ప్రశ్నకు గాను "అవును.. అది భార్యలు రానంతవరకే. సెక్స్‌పై నిషేధమేమీ లేదు" అని హల్‌గ్రిమ్సన్ చెప్పాడు. ఐస్‌లాండ్ పుట్‌బాల్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు గురువారమే వాళ్లతో కలిశారు. టోర్నీలో భాగంగా ఐస్ ల్యాండ్ జట్టు శుక్రవారం నైజీరియాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications