For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెయ్‌మార్ కొట్టిన గోల్‌... చెల్లి చెయ్యి విరిగేలా చేసింది

By Nageshwara Rao
FIFA World Cup 2018: Sister Dislocates Shoulder Celebrating Neymar's Goal
Neymars sister Rafaella Santos dislocated her shoulder celebrating Brazil stars goal against Costa Rica

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ కోస్టారికాపై కొట్టిన గోల్.. అతని చెల్లి చెయ్యి విరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే... టోర్నీలో భాగంగా శుక్రవారం బ్రెజిల్‌-కోస్టారికా జట్లు పోటీ పడ్డాయి. నాకౌట్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ కొట్టి బ్రెజిల్ విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందేమో అనిపించిన తరుణంలో ఆట 89వ నిమిషంలో నెయ్‌మార్ క్రాస్‌ షాట్‌ను అందుకునే క్రమంలో కోస్టారికా కీపర్‌ నెవాస్‌ గాయపడ్డాడు. దీంతో ఏడు నిమిషాలపాటు ఇంజ్యూరీ సమయం ఇవ్వడంతో 90+1లోనే బ్రెజిల్‌ సూపర్‌ గోల్‌తో బ్రెజిల్ తొలి గోల్ నమోదు చేసింది.

Neymars sister Rafaella Santos dislocated her shoulder celebrating Brazil stars goal against Costa Rica

ఆ తర్వాత ఆట కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా నేమార్‌ (90+7) ప్రత్యర్ధి గోల్‌ పోస్టుకు ఆరు గజాల దూరం నుంచి కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బ్రెజిల్‌కు రెండో గోల్‌ అందించాడు. ఈ గోల్ కొట్టిన అనంతరం నేమార్ ఆనందంలో కన్నీటి పర్యంతమయ్యాడు.

అదే సమయంలో నెయ్‌మార్ చెల్లెలు గోల్‌ను సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నంలో చేయి విరగ్గొట్టుకుంది. బ్రెజిల్‌కు చెందిన స్పోర్టీ టీవీ ఈ విషయాన్ని వెల్లడించింది. నెయ్‌మార్ గోల్ కొట్టగానే అతడి చెల్లెలు రాఫెల్లా శాంటోస్ ఎగిరి గంతేసింది. ఈ ప్రయత్నంలో పక్కనే ఉన్న ఫ్రెండ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమె భుజం ఉన్న ఎముక విరిగినట్లు డాక్టర్లు చెప్పారు.

తన ఎడమ చేతికి కట్టు కట్టి ఉన్న ఫొటోను రాఫెల్లా శాంటోస్ తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో బ్రెజిల్‌ 2-0తో విజయం సాధించగా.. వరుసగా రెండు ఓటములతో కోస్టారికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో నెయ్‌మార్ తన స్థాయికి దగ్గర ప్రదర్శన చేయడం లేదు.

టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క గోల్ చేశాడు. నెయ్‌మార్ ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కోస్టారికాతో మ్యాచ్ ముగియగానే ఉద్వేగంతో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, June 28, 2018, 17:55 [IST]
Other articles published on Jun 28, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+