Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

981 రోజుల తర్వాత రీఎంట్రీ.. కన్నీటి పర్యంతమైన నెయ్‌మార్!

బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ కెప్టెన్ నెయ్‌మార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక మైదానంలోనే ఏడ్చేసాడు. దాదాపు 981 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత నెయ్‌మార్ బ్రెజిల్ జెర్సీ ధరించాడు.

ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-సి లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెయ్‌మార్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 3-0 తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-సీ టాపర్‌గా నిలిచిన బ్రెజిల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. అయితే ఈ విజయం కంటే నెయ్‌మార్ రీఎంట్రీనే బ్రెజిల్ అభిమానుల్లో ఎక్కువ ఉత్సాహాన్ని నింపింది.

Neymar: పేకాట ఆడి రూ. 8 కోట్లు పోగొట్టుకున్న ఫుట్‍బాల్ ఆటగాడు..

Neymar: పేకాట ఆడి రూ. 8 కోట్లు పోగొట్టుకున్న ఫుట్‍బాల్ ఆటగాడు..

ఏకపక్షంగా సాగిన మ్యాచ్..

మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే బ్రెజిల్ జట్టు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. స్టార్ స్ట్రైకర్ వినీషియస్ జూనియర్ మైదానంలో చిరుతలా కదిలాడు. ఆట 7వ నిమిషంలోనే బ్రెజిల్‌కు తొలి గోల్ అందించి ఆధిక్యాన్ని చేకూర్చాడు. ఆ తర్వాత ఫస్టాఫ్ అదనపు సమయంలో (45+3వ నిమిషం) వినీషియస్ మరో గోల్ చేసి జట్టు స్కోరును 2-0కి చేర్చాడు. సెకండాఫ్‌లో బ్రెజిల్ ప్లేయర్ మాథ్యూస్ కున్హా 60వ నిమిషంలో మూడో గోల్‌తో బ్రెజిల్ విజయాన్ని ఖాయం చేశాడు.

Neymar Returns for Brazil After 981 Days How Did He Perform Against Scotland

981 రోజుల తర్వాత నెయ్‌మార్ రీఎంట్రీ

బ్రెజిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం ఈ మ్యాచ్‌లో ఆవిష్కృతమైంది. దాదాపు 981 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత నెయ్‌మార్ మైదానంలోకి అడుగుపెట్టాడు. గాయాల కారణంగా అక్టోబర్ 2023 నుంచి జట్టుకు దూరంగా ఉన్న 34 ఏళ్ల నెయ్‌మార్, ఈ మ్యాచ్‌లో 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. తను ఆడిన 14 నిమిషాల్లోనే అద్భుతమైన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు.

మైదానంలో ఉన్న కొద్ది సమయంలోనే నెయ్‌మార్ 13 పాస్‌లకు గానూ 12 విజయవంతమైన పాస్‌లను (92 శాతం) పూర్తి చేశాడు. ప్రత్యర్థి డిఫెండర్లను ముప్ప తిప్పలు పెడుతూ మూడు గోల్ అవకాశాలను సృష్టించాడు. అతని అద్భుత డ్రిబ్లింగ్‌ను అడ్డుకునే క్రమంలో స్కాట్లాండ్ ఆటగాడు రయాన్ క్రిస్టీ ఎల్లో కార్డు కూడా పొందాల్సి వచ్చింది. నెయ్‌మార్ రాకతో హార్డ్ రాక్ స్టేడియం మొత్తం అభిమానుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

FIFA World Cup 2026: నెయ్‌మార్ పునరాగమనం.. స్కాట్లాండ్‌పై బ్రెజిల్ ఘన విజయం!

FIFA World Cup 2026: నెయ్‌మార్ పునరాగమనం.. స్కాట్లాండ్‌పై బ్రెజిల్ ఘన విజయం!

నెయ్‌మార్ భావోద్వేగం..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన నెయ్‌మార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'మూడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జెర్సీని ధరించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది. శారీరకంగా నేను ఫిట్‌గా ఉన్నాను. ఇన్నాళ్లూ ఆటకు దూరం కావడం మానసికంగా నన్ను కలచివేసింది.’అని నెయ్‌మార్ కన్నీటిపర్యంతమయ్యాడు.

బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోట్టి వ్యూహం ప్రకారమే నెయ్‌మార్ సెకండాఫ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన వినిసియస్ జూనియర్.. నెయ్‌మార్ రాక తమకు కొండంత బలాన్నిచ్చిందని తెలిపాడు. 'మా ఆరాధ్య ఆటగాడు జట్టులోకి రావడం మాకందరికీ కొండంత బలాన్నిచ్చింది. అతడు మరింత రాణించి ఈ టోర్నీలో మాకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్నాను'అని వినిసియస్ పేర్కొన్నాడు. నెయ్‌మార్ రాకతో బ్రెజిల్ శిబిరంలో సరికొత్త జోష్ నెలకొంది.

రౌండ్ ఆఫ్ 16 లో ప్రత్యర్థి ఎవరు?

గ్రూప్-సి విజేతగా నిలిచిన బ్రెజిల్ రౌండ్ ఆఫ్ 16 పోరుకు సమాయత్తమవుతోంది. నాకౌట్ దశలో గ్రూప్-ఎఫ్ లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో బ్రెజిల్ తలపడనుంది. నెదర్లాండ్స్, జపాన్ లేదా స్వీడన్‌ల్లో ఏదో ఒక జట్టు బ్రెజిల్‌కు ప్రత్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. నెయ్‌మార్ ఫామ్‌లోకి రావడం, వినీషియస్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం బ్రెజిల్ శిబిరంలో ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది.

Story first published: Thursday, June 25, 2026, 16:33 [IST]
Other articles published on Jun 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+