న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

భారత ఫుట్‌బాల్ క్లబ్‌కు అరుదైన గౌరవం

 Mohun Bagan features on NASDAQ billboards

కోల్‌కతా: క్రికెట్‌‌ను దైవంగా భావించే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్‌ బగాన్‌ క్లబ్‌ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్‌ స్క్వేర్‌లో 'నాస్‌డాక్‌' బిల్‌బోర్డులపై క్లబ్‌ లోగోను, టీమ్‌ జెర్సీ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

భారత్‌ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా 'నాస్‌డాక్‌' బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని 'మోహన్‌ బగాన్‌ డే'గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్‌ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్‌ఏ షీల్డ్‌ టోర్నీలో భాగంగా మోహన్‌ బగాన్‌ 2-1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్‌ యార్క్‌షైర్‌ రెజిమెంట్‌ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది.

తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవం పట్ల మోహన్‌ బగాన్‌ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) కూడా మోహన్ బగాన్ డే దక్కిన గౌరవంపై అభినందనలు తెలపడం విశేషం. 'న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్‌ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్‌ బగాన్‌ను అభినందనలు' అని 'ఫిఫా' ట్వీట్‌ చేసింది.

Story first published: Thursday, July 30, 2020, 8:46 [IST]
Other articles published on Jul 30, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X