Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యేకం: ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆయా జట్లు ఎలా అర్హత సాధించాయో తెలుసా?

Mint Primer: How teams qualify for the football world cup

హైదరాబాద్: రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో సాకర్ సంరంభం మొదలుకానుంది. ఇందుకు మాస్కో నగరం అందంగా ముస్తాబైంది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభమవుతుంది.

ఆరంభ వేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇది 21వ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్‌-ఎలో బరిలో నిలిచింది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు ఉంటాయి. ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి.

ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. అసలు ఫిఫా వరల్డ్ కప్‌కు ఈ 32 జట్లు ఎలా అర్హత సాధించాయో ఒక్కసారి చూద్దామా...

వరల్డ్ కప్‌కు అర్హత ప్రాసెస్ ఎలా ప్రారంభమైంది?

వరల్డ్ కప్‌కు అర్హత ప్రాసెస్ ఎలా ప్రారంభమైంది?

పుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా కింద మొత్తం ఆరు ఖండాంతర సమాఖ్యలు ఉన్నాయి. అవేంటంటే ఆసియా (AFC); ఆఫ్రికా (CAF); నార్త్, సెంట్రల్ అమెరికా, కరేబియన్ (Concacaf); ఓసినియా (OFC); దక్షిణ అమెరికా (Conmebol) చివరగా యూరప్ (UEFA). ఈ సమాఖ్యల కింద మొత్తం 211 దేశాలు ఉన్నాయి. ఆతిథ్య దేశం మినహాయిస్తే వరల్డ్ కప్‌లో పాల్గొనే మిగతా దేశాలన్నీ కూడా క్వాలిఫయిర్ మ్యాచ్‌లు ఆడాయి. తక్కువ ర్యాంకులు కలిగిన ఉన్న దేశాలు తొలుత క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫయిర్ మ్యాచ్‌లు అనేవి మూడు సంవత్సరాలకు ముందే షెడ్యూల్ చేస్తారు.

 పెద్ద జట్లు ఎప్పుడు తమ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి?

పెద్ద జట్లు ఎప్పుడు తమ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి?

పెద్ద జట్లు తమ క్యాంపెయిన్‌ను ఎప్పుడు ప్రారంభించాయనేది ఆయా సమాఖ్యను బట్టి ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ అమెరికాను తీసుకుంటే ఈ సమాఖ్యలో సరైన విధానం అంటూ ఏమీ లేదు. ఈ సమాఖ్యలోనే అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి స్టార్ జట్లు ఉన్నాయి. ఈ సమాఖ్యలోని మిగతా జట్లతో ఒకటి స్వదేశంలో ఆడగా, మరొక మ్యాచ్‌ని దేశం బయట ఆడాయి. క్వాలిఫయింగ్ రౌండ్ పూర్తయ్యే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. అదే, ఆసియా విషయానికి వస్తే ఈ సమాఖ్యలో మొత్తం 47 జట్లు ఉన్నాయి. ఇక్కడ త్రీ-టైర్ విధానాన్ని అనుసరించి పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి.

ఎన్ని జట్లు అర్హత సాధించాయి?

ఎన్ని జట్లు అర్హత సాధించాయి?

రష్యా ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ కప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. యూరప్ సమాఖ్య నుంచి 14 జట్లు.... ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుంచి ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్‌-ఎలో బరిలో నిలిచింది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అర్హత సాధించిన జట్లు గ్రూపుల్లో ఎలా ఉంచబడ్డాయి?

అర్హత సాధించిన జట్లు గ్రూపుల్లో ఎలా ఉంచబడ్డాయి?

మొత్తం 32 జట్లను 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపుకు 4 జట్లు ఉండేలా సర్దుబాటు చేశారు. ఫిఫా ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్లను ఒక్కో గ్రూపుకు యాదృచ్ఛికంగా ఉంచడం జరిగింది. జట్లను విభజించే క్రమంలో భౌగోళిక ఘర్షణలు లేకుండా ఫిఫా వర్గాలు చూశాయి. ఉదాహరణకు ఆసియాకు చెందిన ఏ రెండు దేశాలు ఒక్క గ్రూపులో ఉండకూడదు. అయితే, యూరప్ సమాఖ్యలో మాత్రం ఇలా కుదరదు. ఎందుకంటే యూరప్ సమాఖ్య నుంచి మొత్తం 14 జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. దీంతో ఒక్కో గ్రూపుకు రెండు యూరోపియన్ జట్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ ఎందుకు ఆడటం లేదు?

ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ ఎందుకు ఆడటం లేదు?

జనవరి 2015 నాటికి ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ ప్రారంభమైంది. ఈ క్వాలిఫికేషన్ ప్రారంభమయ్యే నాటికి భారత జట్టు తక్కువ ర్యాంకుని కలిగి ఉంది. ఆసియా సమాఖ్యలో ఉన్న భారత్ పుట్‌బాల్ జట్టు ఫస్ట్ స్టేజిలో నేపాల్‌పై 2-0తో విజయం సాధించింది. ఇక, రెండో స్టేజిలో ఇండియా ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓటమి పాలైన వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.

Story first published: Thursday, June 14, 2018, 17:36 [IST]
Other articles published on Jun 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+