Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: సెమీఫైనల్లోకి స్పెయిన్.. బెల్జియం ఔట్!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో స్పెయిన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం తెల్లవారుజామున జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్ సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. సబ్‌స్టిట్యూబ్ ప్లేయర్ మైఖేల్ మెరినో 88వ నిమిషంలో నాటకీయ గోల్‌తో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో బెల్జియం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 IND vs ENG: స్మృతి మంధాన 'ట్రిపుల్ సెంచరీ’!

IND vs ENG: స్మృతి మంధాన 'ట్రిపుల్ సెంచరీ’!

ఈ మ్యాచ్ ఫస్టాఫ్‌‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. స్పెయిన్ 18 ఏళ్ల లామిన్ యమాల్ అద్వితీయమైన ప్రదర్శనతో బెల్జియంపై ఒత్తిడి పెంచాడు. 30వ నిమిషంలో ఫాబియన్ రూయిజ్ తొలి గోల్ చేసి స్పెయిన్‌కు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. రైట్ సైడ్ నుంచి వచ్చిన పాస్‌ను డాని ఓల్మో గోల్ పోస్ట్‌లోకి కొట్టగా.. బెల్జియం కీపర్ కోర్టోయిస్ అడ్డుకున్నాడు. కానీ రీబౌండ్‌ను అందుకున్న ఫాబియన్ రూయిజ్ అద్భుతంగా గోల్ చేశాడు.

Spain Beat Belgium 2-1 to Secure FIFA World Cup 2026 Semifinal Spot Against France

కన్నీళ్లతో మైదానం వీడాడు..

34వ నిమిషంలో స్పెయిన్‌కు మరో గోల్ చేసే అవకాశం లభించగా.. బెల్జియం కీపర్ కోర్టోయిస్ అడ్డుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే 21 మ్యాచ్‌లు ఆడిన రెండో గోల్ కీపర్‌గా థిబౌట్ కోర్టోయిస్ నిలిచాడు. అయితే మ్యాచ్ సెకండాఫ్‌లో అతనికి కండరాలు పట్టేయడంతో కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు.

అతని స్థానంలో వచ్చిన యువ గోల్ కీపర్ సెన్సీ లెమన్స్ చేసిన ఒక చిన్న పొరపాటు స్పెయిన్‌కు కలిసొచ్చింది. 88వ నిమిషంలో పౌ కుబార్జీ కొట్టిన షాట్‌ను లెమన్స్ సరిగ్గా అడ్డుకోలేకపోయాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన స్పెయిన్ ప్లేయర్ మైఖేల్ మెరినో చాకచక్యంగా బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

FIFA World Cup 2026: మొరాకోపై విజయం.. సెమీస్ చేరిన ఫ్రాన్స్

FIFA World Cup 2026: మొరాకోపై విజయం.. సెమీస్ చేరిన ఫ్రాన్స్

ఫ్రాన్స్‌తో ఢీ..

ఈ విజయంతో స్పెయిన్.. వరుసగా 36వ మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. గత మార్చి 2023 నుంచి స్పెయిన్ ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 2010లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత స్పెయిన్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. మంగళవారం జరిగే సెమీఫైనల్స్‌లో స్పెయిన్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్‌తో తలపడనుంది.

Story first published: Saturday, July 11, 2026, 8:27 [IST]
Other articles published on Jul 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+