న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వర్ణ వివక్షపై పోరాటానికి జోర్డాన్‌ రూ. 755 కోట్లు విరాళం

Michael Jordan announce 100 million US dollars donation to combat racism


చార్లెట్‌:
ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన జాతి వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ మద్దతు తెలిపాడు. భారీ విరాళంతో ముందుకొచ్చాడు. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు జోర్డాన్‌ 100 మిలియన్ డాలర్లు (రూ. 755 కోట్లు) విరాళం ప్రకటించాడు.

ఇందులో 40 మిలియన్ డాలర్లు (రూ. 302 కోట్లు) 'నైకీ' రూపొందించిన 'జోర్డాన్‌ బ్రాండ్‌' తరపున అందజేస్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. 'వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. 'నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే'. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించేవరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం'అని 57 ఏళ్ల చికాగో బుల్స్‌ మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ జోర్డాన్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుతం జాతీయ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) జట్టు చార్లెట్‌ హార్నెట్స్‌కు యజమాని అయిన జోర్డాన్‌... పోలీసుల దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్‌ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓ పోలీసు దాష్టీకానికి నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ బలవడంతో అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్న సంగతి తెలిసిందే.

బాంబు పడాలని సరదాగా కోరుకుంటే.. నిజంగానే ఉగ్రదాడి జరిగింది: సంగక్కరబాంబు పడాలని సరదాగా కోరుకుంటే.. నిజంగానే ఉగ్రదాడి జరిగింది: సంగక్కర

Story first published: Sunday, June 7, 2020, 8:16 [IST]
Other articles published on Jun 7, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X