నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ గోల్: మెక్సికో హీరో లొజానో (వీడియో)

హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో జర్మనీపై చేసిన గోల్ తన కెరీర్‌లోనే బెస్ట్ గోల్ అని మెక్సికోకు చెందిన యువ ఆటగాడు హిర్వింగ్ లొజానో తెలిపాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన జర్మనీకి తొలి మ్యాచ్‌లోనే మెక్సికో షాకిచ్చింది. వరల్డ్ నంబర్‌వన్ జర్మనీ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
గత ఏడు వరల్ కప్‌ల్లో జర్మనీ జట్టు ఓటమన్నదే లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. తాజా మ్యాచ్‌లో పరాజయంతో ఈ రికార్డుకు తెరపడింది. టోర్నీలో భాగంగా ఆదివారం అండర్‌డాగ్ మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 0-1 తేడాతో ఓటమి పాలైంది.

జర్మనీపై మెక్సికోకు రెండో విజయం
మెక్సికో ఫార్వర్డ్ ప్లేయర్ హిర్వింగ్ లొజానో 34వ నిమిషంలో సూపర్‌గోల్‌తో వరల్డ్ కప్ చరిత్రలో జర్మనీపై మెక్సికోకు రెండో విజయాన్నందించాడు. 1982 ప్రపంచకప్‌లో మాత్రమే మెక్సికో జర్మనీని ఓడించగా.. మళ్లీ ఇన్నేళ్లకు జర్మనీపై మెక్సికో ఘన విజయం సాధించింది.
కళ్లుచెదిరే గోల్ కొట్టిన లొజానో
మ్యాచ్ 34వ నిమిషంలో జర్మనీ డిఫెండర్లను తప్పిస్తూ హిర్వింగ్ లొజానో కళ్లుచెదిరే గోల్ కొట్టాడు. దీంతో మెక్సికో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. మ్యాచ్ అనంతరం లొజానో మాట్లాడుతూ "మెక్సికో ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే గొప్ప విజయం అని నేను అనుకోవట్లేదు. కానీ, మా జట్టు సాధించిన అతి పెద్ద విజయాల్లో ఇది ఒకటి అవుతుందని నమ్ముతున్నా" అని చెప్పాడు.

నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ గోల్
"వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని విజయంతో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ గోల్. ప్రపంచకప్‌లో ఆడాలని కలలు కన్నాం. మా కల నెరవేరింది. ఈ విజయాన్ని మెక్సికన్లకు అంకితం ఇస్తున్నాం. ఫ్యాన్స్ మద్దతుతోనే మేం ఈ విజయం సాధించాం" అని లొజానో ఉద్వేగానికి గురయ్యాడు.
జర్మనీకి చెందిన 9 మంది దూరం
వరుసగా గాయాలతో 2014 ప్రపంచకప్‌లో స్టార్ ప్లేయర్లు 9 మంది దూరం కావడంతో కోచ్ జోచిమ్ లో వ్యూహాలను అమలు చేయడంలో కొత్త ఆటగాళ్లకు సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పటివరకు తొలిరౌండ్‌లో వెనుదిరిగిన చరిత్ర లేని జర్మనీకి ఈసారి పెనుగండం ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. టోర్నీలో భాగంగా మెక్సికో తన తదుపరి మ్యాచ్‌లో స్వీడన్‌ను ఢీకొట్టనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications