FIFA WC 2026: మెక్సికో విజయం! లేడీ ఫ్యాన్ రచ్చ..ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా..!(వీడియో)
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో శుభారంభం చేసింది. గురువారం హోరాహోరీగా సాగిన గ్రూప్-ఏ తొలి మ్యాచ్‌లో మెక్సికో 2-0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కంటే మ్యాచ్ రిఫరీ వ్యవహారమే తీవ్ర చర్చనీయాంశమైంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. కనీస హెచ్చరిక లేకుండా ఇలా ముగ్గురు ఆటగాళ్లను రెడ్ కార్డ్స్‌తో మైదానం బయటకు పంపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ రిఫరీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇవ్వాలంటూ సౌతాఫ్రికా అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
లేడీ ఫ్యాన్ క్లీవేజ్ షో..
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మెక్సికో లేడీ ఫ్యాన్ ఒకరు స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెక్సికో గోల్ చేసింది. సౌతాఫ్రికా గోల్‌కీపర్ రోన్వెన్ విలియమ్స్ చేసిన తప్పిదాన్ని మెక్సికో మిడ్‌ఫీల్డర్ ఎరిక్ లిరా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. లీరా అందించిన పాస్‌ను జూలియన్ క్వినోనెస్ గోల్‌గా మలిచి మెక్సికోకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఈ గోల్‌తో స్టేడియం గ్యాలరీలోని ఓ అభిమాని ఎగిరి గంతేసింది. గోల్ వచ్చిన సంతోషంలో ప్రైవేట్ పార్ట్స్ బయటకి కనిపించేలా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సదరు అభిమాని ఉద్దేశపూర్వకంగానే క్లీవేజ్ షో చేసిందని కొందరంటే.. మెక్సికోలో ఇదంతా సాధారణమేనని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె క్లీవేజ్ షో వీడియో మాత్రం నెట్టింట సెగలు పుట్టిస్తోంది.
హిమెనెజ్ గోల్‌తో విజయం..
67వ నిమిషంలో రాబర్టో అల్వరాడో అందించిన క్రాస్‌ను హిమెనెజ్ అద్భుతమైన హెడర్ ద్వారా గోల్‌గా మలిచి మెక్సికో ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే గోల్ కొట్టిన అత్యంత వృద్ధ ఆటగాళ్లలో ఒకడిగా 35 ఏళ్ల హిమెనెజ్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో మెక్సికోకు చెందిన 17 ఏళ్ల గిల్బెర్టో మోరా బరిలోకి దిగి, ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆఖరి వరకు ఇదే ఆధిక్యాన్ని కొనసాగించిన మెక్సికో విజయాన్ని సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

