Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్జెంటీనా విజయం: మధ్య వేలు చూపించి అతి చేసిన మారడోనా, అస్వస్థత

Fifa World cup 2018 : Maradona Attracts Spotlight With Sweary Celebration
Maradona receives treatment after Argentinas dramatic win

హైదరాబాద్: మెస్సీ అభిమానుల ప్రార్ధనలు ఫలించాయి. నాకౌట్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం నైజీరియాతో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌‌కు అర్హత సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌కి ముందు టోర్నీలో అర్జెంటీనా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ డ్రా, మరొక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో అర్జెంటీనా జట్టు నాకౌట్‌కు చేరుతుందా? లేదా అన్న ప్రశ్న మెస్సీ అభిమానులను వేధించింది. దీంతో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు నాకౌట్‌కు చేరాలని ప్రార్ధనలు చేశారు.

1
958045
నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా

నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా

చివరకు అభిమానుల ప్రార్ధనలు ఫలించి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు నైజీరియాపై గెలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. నాకౌట్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 30న కజన్ స్టేడియంలో జరగనుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించడంతో స్టేడియంలో పుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.

14వ నిమిషంలో తొలి గోల్ కొట్టిన మెస్సీ

14వ నిమిషంలో తొలి గోల్ కొట్టిన మెస్సీ

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 14వ నిమిషంలో అద్బుత గోల్‌తో ఖాతా తెరిచి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే, మెస్సీ గోల్ కొట్టినప్పుడు నిద్రపోతూ కనిపించిన మారడోనా... రెండో అర్ధభాగంలో 86వ నిమిషంలో సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్‌ రోజో అనూహ్యంగా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాను 2-1 ఆధిక్యంలో నిలిపి జట్టుకు విజయాన్ని అందించాడు.

మధ్య వేలుని అభిమానులకు చూపించిన మారడోనా

మధ్య వేలుని అభిమానులకు చూపించిన మారడోనా

ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన మారడోనా...అర్జెంటీనా విజయం కోసం ఎంతో పరితపించాడు. పదేపదే ఎగిరి గంతులేస్తూ తన భావోద్రేకాన్ని కట్టడి చేసుకోలేకపోయాడు. టీవీ ఛానళ్లు తమ ప్రసారాల్లో స్టేడియంలో ఉన్న లియోనల్ మెస్సీకి ఎంత ప్రాధాన్యతమిచ్చాయో...అంతే ప్రాధాన్యతను వీఐపీ గ్యాలరీలో ఉన్న 57ఏళ్ల మారడోనాకు కూడా ఇచ్చాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ సందర్భంగా పదేపదే మారడోనా హావభావాలను టీవీల్లో ప్రసారం చేశారు. నరాలు తెగే ఉత్కంఠబరిత పోరులో 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించడంతో మారడోనా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించడంతో స్టేడియం గ్యాలరీలో ఉన్న మారడోనా తన మధ్య వేలుని అభిమానులవైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

అస్వస్థతకు గురైన మారడోనా

అనంతరం తీవ్రమైన ఆందోళనతో మ్యాచ్‌ను వీక్షించిన మారడోనా మ్యాచ్‌ ముగిసే సమయానికి అస్వస్థతకు గురయ్యాడు. కుర్చీలో నుంచి లేవలేక అలాగే కూర్చుండిపోయాడు. నడవలేని స్థితిలో ఉన్న అతన్ని సన్నిహితులు పక్కనే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్లారు.దీంతో మారడోనాకు స్టేడియంలోనే వరల్డ్ కప్ నిర్వాహకులు పారమెడిక్స్ అందించారు. బీపీ తగ్గడంతోనే మారడోనా కాస్త అస్వస్థతకు గురయ్యాడని, ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మారడోనా అభిమానులకు మధ్య వేలు చూపించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Story first published: Wednesday, June 27, 2018, 13:32 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+