Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బార్‌లో తప్పతాగి రచ్చ చేసిన స్టార్ ఫుట్‌బాలర్.. !

Manchester United captain Harry Maguire arrested in Greece

లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్లేయర్, మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్ హరి మాగ్వయర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రీస్‌లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ ఓ బార్‌లో తప్పతాగి రచ్చచేసినట్లు గ్రీకు మీడియా పేర్కొంది.

అక్కడి స్థానిక మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం హరి మాగ్వయర్,అతని స్నేహితులు, బార్‌లో స్థానికులతో గొడవ పడ్డారని, ఈ నేపథ్యంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. యూఈఎఫ్‌ఏ యూరప్ లీగ్‌లో భాగంగా నాలుగు రోజుల క్రితం సెవిల్లా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో 2-1తో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇంగ్లండ్‌కే చెందిన యాష్‌లీ యంగ్ జనవరిలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టును వీడటంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన హరి మాగ్వయర్.. వచ్చి రావడంతో జట్టు పగ్గాలను అందుకున్నాడు. ఇక తమ ప్లేయర్ అరెస్ట్ విషయంపై యునైటెడ్ టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. తమ కెప్టెన్ గ్రీక్ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాడని పేర్కొంది.

బార్‌లో రచ్చ చేసాడనే ఆరోపణలను తోసిపుచ్చిన యునైటెడ్ టీమ్.. హరితో మాట్లాడినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో యునైటెడ్ టీమ్ ఆడిన 55 మ్యాచ్‌ల్లో హరి మాగ్వయర్ బరిలోకి దిగాడు. ఆద్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు కీలక సెమీఫైనల్లో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

Story first published: Friday, August 21, 2020, 18:39 [IST]
Other articles published on Aug 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+