ఫిఫా స్పెషల్: మెస్సీ, రొనాల్డో అందుకోలేని వరల్డ్‌కప్ రికార్డులు

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. సుమారు నెల రోజులు పాటు జరిగిన ఈ వరల్డ్ కప్‌లో బుధవారం నాటి మ్యాచ్‌తో ఫైనల్‌కు చేరిన జట్లు ఏవో తెలిసిపోయాయి. టోర్నీలో భాగంగా ఆదివారం జరిగే ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియా-ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
మాస్కోలోని లుజ్నికీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో క్రొయేషియా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో ఫైనల్ చేరడం క్రొయేషియాకు ఇదే తొలిసారి. 1998 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ చేరుకోవడమే క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన.
ఈ వరల్డ్‌కప్‌లో అనేక సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ లీగ్ స్టేజిలోనే ఇంటిదారి పట్టగా.... మెస్సీ కెప్టెన్‌గా ఉన్న అర్జెంటీనా, రొనాల్డో కెప్టెన్‌గా ఉన్న పొర్చుగల్ జట్లు నాకౌట్‌లోనే నిష్త్రమించాయి. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ వీరిద్దరిని అందని ద్రాక్షలాగే ఊరిస్తోంది.
ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లైన వీరిద్దరూ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తమ దేశానికి ప్రపంచకప్‌ను అందించలేకపోయారు. వయసు రీత్యా ఈ వీరిద్దరికీ రష్యాలో జరగనున్న 2018 ప్రపంచకప్ చివరిది కావచ్చు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ అందుకోలేని రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దామా!

అత్యధిక వరల్డ్ కప్‌లు ఆడిన ఆటగాడిగా పీలే
అత్యధిక వరల్డ్‌కప్‌లు ఆడిన రికార్డు బ్రెజిల్ పుట్‌బాల్ దిగ్గజం పీలే పేరిట ఉంది. అత్యధిక సార్లు వరల్డ్‌కప్ సాధించిన జట్టులో పీలే సభ్యుడు. 1958, 62, 70లలో ప్రపంచకప్ గెలిచిన జట్టులో పీలే సభ్యుడిగా ఉన్నాడు. మెస్సీ, రొనాల్డోలు ప్రాతినిధ్యం వహించిన జట్టులు ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ గెలవలేదు. 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో మెస్సీ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక గోల్స్ 13
వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ 13. ఆరు మ్యాచ్‌ల్లో ఇవి నమోదయ్యాయి. ఈ రికార్డు ఫ్రెంచ్ ఫార్వర్డ్ జస్ట్ ఫంటెయిన్ పేరిట ఉంది. 1958 వరల్డ్‌కప్‌లో ఈ రికార్డుని నెలకొల్పాడు. అప్పటి నుంచి ఈ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. 60 ఏళ్లు గడిచినా ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఏ క్రీడాకారుడు చేరుకోలేదు. 1970లో జర్మనీకి చెందిన గ్రేడ్ ముల్లర్ అనే క్రీడాకారుడు టోర్నీ మొత్తంలో 10 గోల్స్ చేశాడు.

పెద్ద వయసులో గోల్ చేసిన ఆటగాడిగా రోజర్ మిల్లర్
కామెరూన్ క్రీడాకారుడు రోజర్ మిల్లర్ 42ఏళ్ల ఒక నెల ఎనిమిది రోజుల వయస్సులో గోల్ చేశాడు. 1994 వరల్డ్ కప్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును మెస్సీ, రొనాల్డోలు బద్దలు కొట్టాలంటే మరో పదేళ్లు అంతర్జాతీయ పుట్‌బాల్‌లో ఆడాల్సి ఉంది.

జర్మన్ స్ట్రైకర్ మిర్సలోవ్
జర్మన్ స్ట్రైకర్ మిర్సలోవ్ క్లోసి నాలుగు (2002, 2006, 2010, 2014) వరల్డ్‌కప్‌ల్లో కలిపి మొత్తం 16 గోల్స్ చేశాడు. 2006లో గోల్డెన్ బూట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం మెస్సీ , రొనాల్డొలు ఈ రికార్డుకు చాలా దూరంలో ఉన్నారు.

బ్రెజిల్‌కు చెందిన కఫూ
బ్రెజిల్‌కు చెందిన కఫూ అత్యధికంగా సార్లు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడాడు. 1994, 1998, 2002లో ఫైనల్స్ ఆడగా, 2006లో ప్రపంచకప్ జట్టులో సభ్యుడు. ప్రపంచ కప్ చరిత్రలో మూడు సార్లు ఫైనల్స్‌లో బరిలోకి దిగిన ఆటగాడు కఫూనే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications