మెస్సీ X రొనాల్డో పోరు ఎప్పుడంటే..?
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు. ఫుట్‌బాల్ దిగ్గజాలైన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మధ్య పోరు చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే ఆ కోరిక ఈసారి నెరవేరే అవకాశముంది. ఈ టోర్నీలో గ్రూప్-జేలో ఉన్న అర్జెంటీనా వరుస విజయాలతో జోరు మీదుండగా.. గ్రూప్-కేలో ఉన్న పోర్చుగల్ కూడా జోరు అందుకుంది. తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో డ్రా చేసుకున్న పోర్చుగల్.. రెండో మ్యాచ్‌లో 5-0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఇరు జట్లు ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించాయి. అయితే ఈ రెండు జట్లు తాజా ప్రపంచకప్‌లో పోటీ పడేందుకు మూడు అవకాశాలు ఉన్నాయి.
1. రౌండ్ ఆఫ్ 16లో
ఒకవేళ అర్జెంటీనా తమ గ్రూప్-జేలో అగ్రస్థానం సాధించి, పోర్చుగల్ తమ గ్రూప్-కేలో రన్నరప్‌గా నిలిస్తే.. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌ల్లో మ్యాచ్‌లు గెలిచిన అనంతరం, ఈ రెండు జట్లు రౌండ్ ఆఫ్ 16 లోనే నేరుగా తలపడే అవకాశం వస్తుంది.

2. సెమీ ఫైనల్స్ లేదా క్వార్టర్ ఫైనల్స్
రెండు జట్లూ తమ తమ గ్రూప్‌ల్లో టాప్ పొజిషన్‌లో ముగించి, నాకౌట్ టోర్నమెంట్ బ్రాకెట్ డిజైన్ ప్రకారం ముందుకు సాగితే.. ఫైనల్‌కు ముందే క్వార్టర్ ఫైనల్స్ లేదా సెమీఫైనల్స్‌లో తలపడే అవకాశం ఉంది.
3. డ్రీమ్ ఫైనల్ (జూలై 19)
ఒకవేళ ఇరు జట్లు ఫైనల్ చేరితే ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌గా నిలిచిపోతుంది. రెండు జట్లు తమ గ్రూప్‌లలో వేర్వేరు స్థానాల్లో నిలిచి, బ్రాకెట్‌లో ఇరువైపులా విడిపోయి, నాకౌట్ మ్యాచ్‌లన్నింటిలోనూ విజయం సాధిస్తే.. జూలై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ వర్సెస్ రొనాల్డో పోరును ప్రపంచం చూడవచ్చు. అభిమానులు గట్టిగా కోరుకుంటే అద్బుతమైనా ఇది జరగవచ్చు.
మెస్సీ(5 గోల్స్), రొనాల్డో(2 గోల్స్) ఈ ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లు పూర్తయ్యాక అధికారిక నాకౌట్ బ్రాకెట్ ఖరారైతే.. మెస్సీ X రొనాల్డో ఏ రౌండ్‌లో తలపడతారనేదానిపై మరింత క్లారిటీ రానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

