Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

100వది: మెస్సీ గోల్‌తో నాకౌట్‌కు అర్జెంటీనా (వీడియో)

Lionel Messis first goal in World Cup 2018 was the tournaments 100th

హైదరాబాద్: నాకౌట్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌ ఆశలను సజీవం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 14వ నిమిషంలో అద్బుత గోల్‌తో ఖాతా తెరిచి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మెస్సీ కొట్టిన గోల్‌కు ఓప్రత్యేకత ఉంది. ఇది టోర్నీలో 100వ గోల్ కావడం విశేషం. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధబాగంలో అనూహ్యంగా నైజీరియా నుంచి మెస్సీ బృందానికి గట్టి పోటీ ఎదురైంది. 49వ నిమిషంలో అర్జెంటినా ఆటగాడు జేవియర్ మస్చెరానో ఫౌల్‌ చేయడంతో నైజీరియాకు పెనాల్టీ లభించింది.

1
958045
14వ నిమిషంలో అద్బుత గోల్‌తో ఖాతా తెరిచి అర్జెంటీనా

14వ నిమిషంలో అద్బుత గోల్‌తో ఖాతా తెరిచి అర్జెంటీనా

దీనిని సద్వినియోగం చేసుకున్న నైజీరియా ఆటగాడు విక్టర్ మోసెస్ తెలివిగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి గోల్ స్కోరుని సమం చేశాడు. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్‌లో పెనాల్టీగోల్‌ సాధించిన రెండో ఆటగాడిగా విక్టర్‌ మోసెస్‌ రికార్డు నమోదు చేశాడు. 2010 ప్రపంచకప్‌లో యాకుబ్‌ నెట్టెడ్‌ నైజీరియా తరపున తొలిసారి పెనాల్టీ గోల్‌ సాధించాడు.

అర్జెంటీనాకు రెండో గోల్ అందించిన మార్కోస్‌ రోజో

ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేసేందుకు హోరాహోరాగా పోరాడాయి. ఈ క్రమంలో 86వ నిమిషంలో సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్‌ రోజో అనూహ్యంగా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత నైజీరియా గోల్ స్కోరుని సమం చేసేందుకు ప్రయత్నించినా సరైన అవకాశం లభించలేదు.

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీపై ఆధారపడలేదు. ఆట ముగిసేలోపు నైజీరియా మరో గోల్‌ చేయకపోవడంతో ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టోర్నీలో భాగంగా గ్రూప్-డి నుంచి క్రొయేషియా, అర్జెంటీనా జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన క్రోయేషియా ఇప్పటికే నాకౌట్‌ చేరింది.

క్రొయేషియా-ఐస్‌లాండ్‌ మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా భవితవ్వంనాకౌట్‌లో ప్రాన్స్‌తో తలపడనున్న అర్జెంటీనా

క్రొయేషియా-ఐస్‌లాండ్‌ మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా భవితవ్వంనాకౌట్‌లో ప్రాన్స్‌తో తలపడనున్న అర్జెంటీనా

ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరడం అర్జెంటీనాకు ఇది వరుసగా నాలుగోసారి. గ్రూప్‌-డి నుంచి క్రియేషియా, అర్జెంటీనా నాకౌట్‌కు చేరుకున్నాయి. నాకౌట్‌లో భాగంగా జూన్ 30న జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కజన్ స్టేడియంలో జరగనుంది.

Story first published: Wednesday, June 27, 2018, 11:10 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+