For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊహించలేదు: బర్త్‌డే నాడు మెస్సీకి ప్రత్యేకమైన గిప్ట్

By Nageshwara Rao
Lionel Messi to receive FIFA World Cup replica as birthday gift

హైదరాబాద్: పుట్టినరోజు నాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి ఊహించని బహుమతి అందింది. తన అద్భుతమైన ఆటతీరుతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న లియోనల్ మెస్సీ గత ఆదివారం (జూన్‌ 24)న 31వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ప్రస్తుతం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో మెస్సీ అర్జెంటీనా జట్టు కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. రష్యాలోని బ్రానిట్సీ పట్టణ ప్రజలు మెస్సీకి పెద్ద అభిమానులు. ఈ నేపథ్యంలో బ్రానిట్సీకి చెందిన మెస్సీ అభిమానులు మెస్సీకి ఫిపా వరల్డ్ కప్ నమూనాను తయారు చేసి పుట్టిన రోజు కానుకగా ఇచ్చారు.

Lionel Messi to receive FIFA World Cup replica as birthday gift

దీంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కూడా అర్జెంటీనా పుట్‌బాల్ జట్టు బస చేస్తోన్న హోటల్‌కు పంపించారు. ఈ వరల్డ్ కప్ నమూనాను రష్యాకు చెందిన సంప్రదాయ గజెల్ సెరామిక్స్‌తో రూపొందించడం విశేషం. బ్రానిట్సీ పట్టణ అభిమానుల నుంచి అందుకున్న ఈ కానుకలు చూసి మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా వారందరికీ మెస్సీ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 0-3తో ఓటమి పాలైంది. దీంతో అర్జెంటీనా జట్టు నాకౌట్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా కేవలం ఒక్క పాయింట్‌తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. టోర్నీలో భాగంగా జూన్ 16న నైజీరియాతో అర్టెంజీనా జట్టు తలపడనుంది.

Story first published: Friday, June 22, 2018, 15:27 [IST]
Other articles published on Jun 22, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+