Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లియోనల్ మెస్సీ హత్యకు కుట్ర.. బాంబులతో పేల్చేసే ప్లాన్!

ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ 2026 సందర్భంగా అర్జెంటీనా స్టార్, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హ్యతకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ అర్జెంటీనా దిగ్గజాన్ని లక్ష్యంగా చేసుకొని టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. లియోనెల్ మెస్సీని హత్య చేయాలని ఉగ్రమూకలు ప్రయత్నించాయని స్పానిష్ న్యూస్ పేపర్ కథనం ప్రచురించింది.

విధి రాసిన వింత కథ.. నాడు మెస్సీ చేతిలో పసికందు.. నేడు ప్రత్యర్థి!

విధి రాసిన వింత కథ.. నాడు మెస్సీ చేతిలో పసికందు.. నేడు ప్రత్యర్థి!

ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం అమెరికా పోలీసుల వద్ద ఉందని పేర్కొంది. అయితే ఈ ప్రయత్నాలను అమెరికా ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీస్ సహకార విభాగం నేతృత్వంలోని సెక్యూరిటీ నెట్‌వర్క్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని ఆ కథనంలో తెలిపింది. ఆత్మహుతి దాడితో మెస్సిని చంపాలని ఉగ్రమూకలు ప్రయత్నించాయని వెల్లడించింది.

Lionel Messi Named as Target in Chilling Bomb Threat Linked to US FIFA World Cup Terror Plot Reports

మెస్సి హ్యతకు సంబంధించి ఓ దుండగుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టినట్లు కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. 'నా శరీరానికి నాలుగు బాంబులు పెట్టుకొని మెస్సీని పేల్చేసేందుకు అట్లాంటా స్టేడియానికి వెళ్తున్నా'అని నిందితుడు పోస్ట్ పెట్టి తొలిగించినట్లు సమచారం. ఈ పోస్ట్‌తో అప్రమత్తమైన భద్రతా అధికారులు ఉన్నత స్థాయిలో సమీక్షించి కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పానిష్ పత్రిక వెల్లడించింది.

డాలస్ ఎయిర్‌ పోర్ట్‌కు వచ్చిన ఓ ఫోన్ కాల్‌‌ను కూడా అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇంట్లో తయారు చేసిన బాంబులతోపాటు ఏఆర్-15 తుపాకీతో స్టేడియానికి వెళ్తున్నట్లు ఆ అనుమానితుడు పేర్కొన్నాడని ఆ కథనంలో రాసుకొచ్చారు. మెస్సితో పాటు ఇతర క్రీడాకారులు, పోలీస్ అధికారులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని భద్రతా సిబ్బంది గుర్తించారు. లియోనెల్ మెస్సీతో పాటు క్రిస్టియానో రొనాల్డో కూడా వారి జాబితాలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

FIFA World Cup 2026: స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ.. అవార్డుల పూర్తి జాబితా ఇదే!

Also Read

FIFA World Cup 2026: స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ.. అవార్డుల పూర్తి జాబితా ఇదే!

పోర్చుగల్ ఫుట్‌బాల్ టీమ్ బస ఎక్కడని ఆరా తీసినట్లు కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో అప్పటి నుంచి భద్రతపరంగా అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఫిఫా ప్రపంచకప్ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ విజేతగా నిలవగా.. అర్జెంటీనా రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, August 8, 2026, 11:23 [IST]
Other articles published on Aug 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+