Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజయం!

ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ గ్రూప్-జే పోరులో భాగంగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా మెస్సీ ఈ ఫీట్ సాధించాడు.

డల్లాస్‌ వేదికగా మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో అర్జెంటీనా నాకౌట్ దశకు అర్హత సాధించింది. లియోనెల్ మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. అర్జెంటీనా శుభారంభం

చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. అర్జెంటీనా శుభారంభం

పెనాల్టీ మిస్ చేసినా.. రికార్డు గోల్‌తో రీఎంట్రీ..

మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే అర్జెంటీనాకు పెనాల్టీ లభించింది. అయితే మెస్సీ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు బయటగా వెళ్లడంతో ఆస్ట్రియా ఊపిరి పీల్చుకుంది. కానీ, మెస్సీ, అర్జెంటీనా ఏ మాత్రం నిరాశ చెందలేదు. 38వ నిమిషంలో ఫాకుండో మెదినా అందించిన క్రాస్‌ను మెస్సీ తన అద్భుతమైన లెఫ్ట్ లెగ్ ఫినిషింగ్‌తో గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌తో‌నే వరల్డ్ రికార్డ్ అందుకున్నాడు. ఈ క్రమంలో జర్మనీ మాజీ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. మెస్సీకి ఇది ఏడో ప్రపంచకప్‌ గోల్.

Lionel Messi Creates History Becomes All-Time FIFA World Cup Top Scorer With 18 Goals

ఆ తర్వాత మ్యాచ్ ముగిసే సమయానికి (90+5వ నిమిషంలో) ఎంజో ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను మెస్సీ గోల్‌గా మల్చడంతో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. తాజా ప్రపంచకప్ టోర్నీలో 5 గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నాడు. మొత్తంగా ప్రపంచకప్‌లో 28 మ్యాచ్‌లాడిన మెస్సీ 18 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. యాక్టివ్ ప్లేయర్లలో కైలియన్ ఎంబాపె (14 గోల్స్) మాత్రమే అతనికి సమీపంగా ఉన్నాడు.

రికార్డుల రారాజు..

ఈ అద్వితీయమైన ప్రదర్శనతో మెస్సీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన మూడో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. అతని కంటే ముందు జస్ట్ ఫోంటైన్, జైర్జినోలు ఈ ఘనతను అందుకున్నారు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 7 పెనాల్టీల్లో 3 మిస్ చేసిన ఆటగాడిగానూ మెస్సీ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. అయితే పెనాల్టీ మిస్ చేసినప్పటికీ అర్జెంటీనాను గెలిపించడం మెస్సీకి ఇదే తొలిసారి మాత్రమే.

FIFA World Cup 2026: కన్నీటిపర్యంతమైన మెస్సీ! (వీడియో)

FIFA World Cup 2026: కన్నీటిపర్యంతమైన మెస్సీ! (వీడియో)

తిరుగులేని అర్జెంటీనా డిఫెన్స్..

లియోనెల్ స్కలోని పర్యవేక్షణలోని అర్జెంటీనా జట్టు అటాకింగ్‌లోనే కాకుండా డిఫెన్స్‌లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా జట్టు కేవలం ఒకే ఒక్క షాట్‌ను మాత్రమే గోల్ పోస్ట్‌పైకి కొట్టగలిగింది. 2022 ప్రపంచకప్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిన తర్వాత.. అర్జెంటీనా ఇప్పటివరకు ప్రపంచకప్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో (6 విజయాలు, 2 డ్రాలు) ఓటమి లేకుండా దూసుకుపోతోంది.

Story first published: Tuesday, June 23, 2026, 9:10 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+