Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. భావోద్వేగ పోస్ట్!

ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇక నుంచి అర్జెంటీనా తరఫున బరిలోకి దిగనని స్పష్టం చేశాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో స్పెయిన్ చేతిలో ఓడిన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నానని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. అయితే తన తండ్రి మరణం ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందన్నాడు.

'ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ గురించి చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను అర్జెంటీనా నేషనల్ టీమ్ నుంచి తప్పుకుంటున్నానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పటికీ బాధగానే ఉంది. కానీ తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అర్జెంటీనా తరఫున మెరుగైన ప్రదర్శన చేసేందుకు, విజయాలు అందించేందుకు నా వంతుగా ప్రయత్నించాను. ఈ జెర్సీ కోసం మైదానంలో నా సర్వస్వాన్ని ధారపోశాను. అర్జెంటీనా అభిమానులు గర్వపడేలా చేసేందుకు తీవ్రంగా పోరాడాను.

Lionel Messi Announces International Retirement Ends Historic Argentina Career

నా ప్రయాణం ముగింపు దశకు వచ్చింది. ఇది నన్ను చాలా బాధపెడుతోంది. జాతీయ జట్టు తరఫున ఆడటాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడుతాను. నా దగ్గర ఉన్నదంతా జట్టు కోసం ఇచ్చేసాను. ఇక ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. అర్జెంటీనా జట్టులో చాలా మంది గొప్ప యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు అర్జెంటీనా తరఫున ఆడేందుకు పూర్తి అర్హులు.

లియోనల్ మెస్సీ హత్యకు కుట్ర.. బాంబులతో పేల్చేసే ప్లాన్!

లియోనల్ మెస్సీ హత్యకు కుట్ర.. బాంబులతో పేల్చేసే ప్లాన్!

గత 20 ఏళ్లుగా మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మైదానంలో మీ అరుపులను నేను చాలా మిస్ అవుతాను. ఇకపై మీలో ఒకడిగా బయట కూర్చుని జట్టును చీర్ చేస్తూ.. మద్దతు తెలుపుతాను.

కష్ట సుఖాల్లో.. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎప్పుడూ నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి ధన్యవాదాలు. నాతో పాటు ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్క కోచ్‌కు, సహచర ఆటగాళ్లకు, అఫీషియల్స్‌కు కృతజ్ఞతలు. జీవితంలో మరువలేని ఎన్నో మధుర జ్ఞాపకాలను నాతో పాటు తీసుకెళ్తున్నాను.

లియోనెల్ మెస్సీకి బిగ్ షాక్.. ప్రత్యర్థిని కొట్టిన వివాదంలో భారీ జరిమానా! (వీడియో)

Also Read

లియోనెల్ మెస్సీకి బిగ్ షాక్.. ప్రత్యర్థిని కొట్టిన వివాదంలో భారీ జరిమానా! (వీడియో)

అర్జెంటీనా కలలు కన్న క్షణాలను నా తోటి ఆటగాళ్లతో కలిసి మీకు అందించాననే తృప్తి, గర్వంతో నేను తప్పుకుంటున్నాను. మీ అందరితో కలిసి ఈ ప్రయాణం చేయడం ఒక అద్భుతం. ఐ లవ్ యూ ఆల్!

నన్ను అర్జెంటీనా దేశస్తుడిగా పుట్టించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. అర్జెంటీనా‌గా.. ముందుకు సాగుదాం! నేను ఈ మాటలను జూలై 21న.. ఫైనల్ అయిన రెండు రోజుల తర్వాత రాశాను. నాన్న మరణం తర్వాత ఈ నిర్ణయం సరైనదేనని అనిపించింది.'అని లియోనెల్ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు.

అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్ లు ఆడిన మెస్సీ.. ఏకంగా 125 గోల్స్ చేయడంతో పాటు 68 గోల్స్‌కు అసిస్ట్‌ చేశాడు. తన 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో దేశానికి ఓ ఫిఫా ప్రపంచ కప్‌తో పాటు రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించాడు. గ్రౌండ్‌లో అతను చేసే విన్యాసాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినా.. ఫ్రాంచైజీ ఫుట్‌బాల్ లీగ్స్‌లో మెస్సీ కొనసాగనున్నాడు.

Story first published: Monday, August 31, 2026, 21:04 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+