న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మారడోనాకు నివాళలర్పించిన లియోనల్ మెస్సీకి భారీ జరిమానా!

Lionel Messi and Barcelona fined 780 euros for tribute to Diego Maradona

మాడ్రిడ్(స్పెయిన్): ఇటీవలే మరణించిన సాకర్ దిగ్గజం డీగో మారడోనాకు నివాళి అర్పించినందుకు అర్జెంటినా స్టార్ ఫుట్‌‌బాలర్ లియోనల్ మెస్సీకి స్పానిష్ సాకర్ ఫెడరేషన్ 600 యూరోల(రూ.53,640) జరిమానా విధించింది. స్పానిష్‌ లీగ్‌లో బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న లియోనల్ మెస్సీ.. మారడోనాకు నివాళలర్పించాలనే ఉద్దేశంతో నిబంధనలను అతిక్రమించాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒసాసునా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా 4-0 తేడాతో గెలుపొందింది. బార్సిలోనా తరఫున గోల్ చేసిన అనంతరం మెస్సీ తన జెర్సీని తీసేసి.. లోపల ఉన్న మారడోనా జెర్సీని ప్రదర్శిస్తూ.. ఆకాశం వైపు చూస్తూ ముద్దులు పెడుతూ.. దిగ్గజ ఆటగాడికి నివాళులు అర్పించాడు.

మ్యాచ్ అనంతరం మారడోనా పాత ఫొటోను.. తాను సైతం అదే జెర్సీ వేసుకున్న ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెస్సీ.. ఫేర్‌వేల్, డీగో అని స్పానిష్‌లో మెసేజ్ పెట్టాడు. మ్యాచ్ సమయంలో జెర్సీ తీసేసి.. వేరే జెర్సీని ప్రదర్శించినందుకు మెస్సీకి యెల్లో కార్డు చూపించడంతోపాటు.. సాకర్ ఫెడరేషన్ అతనితో పాటు బార్సిలోనాకు సైతం 180 యూరోల (216 డాలర్లు) జరిమానాను విధించింది. వీరి ఉద్దేశంలో తప్పులేకున్నా.. లీగ్‌లో ఇతర జెర్సీలను ప్రదర్శించడం నిబంధనలకు విరుద్దమని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ పేర్కొంది. మెస్సీతోపాటు బార్సిలోనా క్లబ్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.

అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన మారడోనా ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్‌ అయ్యారు. కానీ అంతలోనే గుండెపోటు గురై తుది శ్వాస విడిచారు.

ఆసీస్‌తో చెలరేగడానికి ధోనీ చెప్పిన ఆ చిట్కానే కారణం: రవీంద్ర జడేజాఆసీస్‌తో చెలరేగడానికి ధోనీ చెప్పిన ఆ చిట్కానే కారణం: రవీంద్ర జడేజా

Story first published: Thursday, December 3, 2020, 11:46 [IST]
Other articles published on Dec 3, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X