Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి స్థానంలో తనయుడు: 98 మ్యాచ్ ఫలితం పునరావృతం అవుతుందా?

Like father: Schmeichel hears echoes of France 98

హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా ఫ్రాన్స్-డెన్మార్క్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ను డెన్మార్క్ డ్రా చేసుకుంటే చాలు నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. కానీ, డెన్మార్క్ గోల్ కీపర్ పీటర్ స్చ్మీచెల్ వైఫల్యం కారణంగా డెన్మార్క్‌ 1-2తో ఓటమి పాలైంది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో టోర్నీ నుంచి డెన్మార్క్ నిష్క్రమించింది. సరిగ్గా మళ్లీ 20 ఏళ్ల తర్వాత రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో డెన్మార్క్‌‌కు ఇదే పరిస్థితి తలెత్తింది. ఇక్కడ విశేషం ఏంటంటే డెన్మార్క్ జట్టు మళ్లీ ఫ్రాన్స్‌తోనే తలపడనుంది. అదీ కూడా గ్రూప్‌ స్టేజిలో చివరి మ్యాచ్‌.

అచ్చం అప్పట్లాగే ఫ్రాన్స్‌ 6 పాయింట్లతో ఉంటే డెన్మార్క్‌ 4 పాయింట్లతో ఉంది. ఇప్పుడు కూడా గ్రూప్ బీలో ఉన్న డెన్మార్క్ జట్టు 4 పాయింట్లతో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ 6 జట్లతో టాప్ స్థానంలో ఉంది. అయితే, ఈసారి కీపర్‌ మారాడు.

20 ఏళ్ల క్రితం ఏ ఆటగాడు ఫ్రాన్స్‌ను నిలవరించలేకపోయాడో అతని తనయుడు కాస్పర్‌ డెన్మార్క్‌కు ఇప్పుడు గోల్‌కీపర్‌‌గా ఉన్నాడు. 1998లో ఫ్రాన్స్‌ ఆటగాడు కొట్టిన పెనాల్టీని ఆపలేకపోయిన పీటర్‌.. ఇప్పుడు తన కుమారుడు డెన్మార్క్‌ను గెలిపిస్తాడనే నమ్మకంతో ఉన్నాడు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. టోర్నీలో భాగంగా మంగళవారం ఫ్రాన్స్‌-డెన్మార్క్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో డెన్మార్క్ విజయం సాధిస్తే ఆరు పాయింట్లతో నేరుగా నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే, పాయింట్ల పట్టకలో ఆరు పాయింట్లతో ఉన్న ఫ్రాన్స్ కూడా డెన్మార్క్‌తో పాటు నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.

Story first published: Tuesday, June 26, 2018, 11:15 [IST]
Other articles published on Jun 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+