ఎంబాపే సెంచరీ ధమాకా.. ఇరాక్‌పై ఫ్రాన్స్ ఘన విజయం
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఫ్రాన్స్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఫ్రాన్స్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం తెల్లవారు జామున వర్షం అంతరాయం కలిగించిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్‌ను చిత్తు చేసింది.
100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే రెండు గోల్స్‌తో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉస్మాన్ డెంబెలే మరో గోల్ అందించాడు. ఈ మ్యాచ్ ఫస్టాఫ్ అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు రెండు గంటల 10 నిమిషాల తర్వాత తిరిగి ఆట ప్రారంభమైంది.
రికార్డుల రారాజు ఎంబాపె..
ఈ మ్యాచ్ ప్రారంభమైన 14వ నిమిషంలోనే మైఖేల్ ఒలిసే అందించిన పాస్‌ను ఎంబాపె అద్భుతమైన గోల్‌గా మలిచాడు. సెకండాఫ్‌లో 54వ నిమిషంలో ఇరాక్ డిఫెన్స్ లోపాలను సద్వినియోగం చేసుకుంటూ డెంబెలే ఇచ్చిన పాస్‌తో ఎంబాపె రెండో గోల్ నమోదు చేశాడు. 66వ నిమిషంలో డెంబెలే ఫ్రాన్స్ తరఫున మూడో గోల్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ రెండు గోల్స్‌తో ఎంబాపె (16 గోల్స్) ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే 18 గోల్స్‌తో లియోనెల్ మిస్సీ చరిత్ర సృష్టించాడు. ఎంబాపె అతన్ని అనుసరిస్తున్నాడు.
అతి పిన్న వయస్కుడిగా..
27 ఏళ్ల 184 రోజుల వయసులోనే 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అతి పిన్న వయస్కుడిగా ఎంబాపె చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్ తరఫున ఈ మైలురాయిని అందుకున్న 10వ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా ఎంబాపే గుర్తింపు పొందాడు. శాండోర్ కోసిస్, గుల్లెర్మో స్టాబిలే, లియోనెల్ మెస్సీలు అతని కంటే ముందున్నారు.
ఉస్మాన్ డెంబెలేకు మెజర్ టోర్నమెంట్లలో (ప్రపంచకప్/యూరో) 20 మ్యాచ్‌ల తర్వాత నమోదైన తొలి గోల్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు, సొంత తప్పిదాల వల్లే వరుసగా గోల్స్ సమర్పించుకున్న ఇరాక్ జట్టు నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తదుపరి మ్యాచ్‌లో సెనెగల్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications