మిస్సింగ్ కేసు విషాదాంతం: కేరళలో శవమై తేలిన మెస్సీ అభిమాని

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ వీరాభిమాని కేరళకు చెందిన డీనూ అలెక్స్ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా చేతిలో అర్జెంటీనా పరాభవాన్ని తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్లిపోయిన కేరళ అభిమాని డీనూ అలెక్స్ ప్రాణాలు కోల్పోయాడు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మినాచిల్ నదిలో దూకి ఆత్మహత్య
కొట్టాయానికి సమీపంలోని మినాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను నివాసం ఉండే అరుమన్నూర్ గ్రామం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

30 ఏళ్ల డీనూ అలెక్స్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా
కొట్టాయం జిల్లా అర్మనూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల డీనూ అలెక్స్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. లియోనల్ మెస్సీకి వీరాభిమాని. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి అర్జెంటీనా-క్రోయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో ఓడిపోయింది.

మెస్సీ దారుణంగా నిరుత్సాహపరిచాడు
దీంతో మనస్థాపం చెందిన డీనూ "నా ఫెవరెట్ జట్టు ఓడింది. మెస్సీ దారుణంగా నిరుత్సాహపరిచాడు. నాకు ఈ ప్రపంచంలో చూసేందుకు ఇంకా ఏం మిగల్లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ" అంటూ మళయాళంలో ఓ లేఖ రాసి పెట్టి వెళ్లిపోయాడు.

డాగ్ స్క్వాడ్ సాయంతో ఆ చుట్టుపక్కల గాలింపు
శుక్రవారం ఉదయం నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆ చుట్టుపక్కల గాలింపు చేట్టారు. చివరకు పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో డీనూ అలెక్స్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం పోలీసులు గుర్తించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications