Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ ఓటమి: మార్కెట్‌లో మాంసాహారంగా మారిపోయిన ఆక్టోపస్

జపాన్ ఓటమితో మార్కెట్‌లో మాంసాహారంగా మారిపోయిన ఆక్టోపస్
Japans Psychic octopus killed and sent to market

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు సాకర్ అభిమానులను అలరిస్తున్నాయి. మ్యాచ్ జరగడానికి ముందే తమ తమ అంచనాలతో ఈ జట్టు గెలుస్తుందంటూ జోస్యం కూడా చెబుతున్నారు. ఈ జోస్యం చెబుతున్న వారిలో పుట్‌బాల్ విశ్లేషకులతో పాటు జంతువులు కూడా ఉన్నాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే చెవిటి పిల్లి, పంది చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. మరోవైపు జపాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల గురించి టోక్యోలో 'రాబియో' అనే పేరుగల ఆక్టోపస్‌ చెప్పిన జోస్యం కూడా నిజమైంది. దీంతో ఈ ఆక్టోపస్ జపాన్‌లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

జపాన్‌ మ్యాచ్‌ల ఫలితాల గురించి సరిగ్గా జోస్యం చెప్పిన ఆక్టోపస్‌ త్వరలో జపాన్ వాసులకు ఆహారం కానుంది. నిజానికి ఈ ఆక్టోపస్‌ను కిమియో ఆబె అనే వ్యక్తి సముద్రం నుంచి తీసుకొచ్చాడు. అదే సమయంలో రష్యాలో వరల్డ్ కప్ ప్రారంభం కావడంతో ఈ ఆక్టోపస్‌‌తో జ్యోతిష్యం చెప్పించడం మొదలుపెట్టాడు.

మూడు నీళ్లు నిండిన బకెట్లపై ఒక్కో ఫలితం రాసి వాటి మధ్యలో ఈ ఆక్టోపస్‌ను వదిలేవారు. అది దేనిని ఎంచుకుంటే అదే ఫలితం వచ్చింది. అయితే ఇప్పుడు కిమియో దానిని చంపేసి తన దుకాణంలో అమ్మకానికి పెట్టాడు. ఈ సందర్భంగా కిమియో మాట్లాడుతూ చేపలు పట్టడమే జీవనాధారమైన కిమియో తనకు మరో మార్గం లేకుండా పోయిందన్నాడు.

రాబియోకు వస్తున్న పేరు ప్రఖ్యాతులకంటే దానిని మాంసంగా మార్చి అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తానని, తప్పని పరిస్థితుల్లో దానిని చంపాల్సి వచ్చిందని తెలిపాడు. గ్రూప్‌ దశలో కొలంబియాతో జపాన్‌తో గెలుస్తుందని, సెనెగల్‌తో డ్రా చేసుకుని... పోలాండ్‌ చేతిలో ఓడుతుందని ఈ ఆక్టోపస్‌ చెప్పిన జోస్యం 100 శాతం నిజమైంది.

Story first published: Thursday, July 5, 2018, 11:48 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+