మరో ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

రోమ్: ఫుట్‌బాల్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా అకాల మృతితో బాధలో ఉన్న యావత్ ఫుట్‌బాల్ ప్రపంచం మరో శిఖరాన్ని కోల్పోయింది. ఇటలీ ఫుట్‌బాల్ స్టార్, 1982 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత పాలోరాసీ(64) గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన పనిచేస్తున్న ఆర్‌ఏఐ స్పోర్ట్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ధృవీకరించింది. 1982 స్పెయిన్‌లో జరిగిన సాకర్ ప్రపంచకప్‌లో రాసీ 6 గోల్స్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.
లీగ్ దశలో బ్రెజిల్ పై హ్యాట్రిక్ సాధించిన ఆయన తర్వాత సెమీఫైనల్స్‌లో పొలాండ్‌పై 2 గోల్స్ కొట్టారు. ఇక వెస్ట్ జర్మనీతో తలపడిన ఫైనల్లో ఫస్ట్ గోల్ రాసీనే సాధించారు. దాంతో ఇటలీ 3-1 తేడాతో వెస్ట్ జర్మనీపై విజయం సాధించింది. ఇదిలా ఉండగా, పాలోరాసీ జువాంటస్ జట్టు తరఫున నాలుగేళ్లు ఆడి రెండుసార్లు 'ఇటాలియన్ సిరీస్-ఏ' టైటిళ్లు అందించారు. ఒక యూరోపియన్ కప్‌ను కూడా గెలుచుకున్నారు. అనంతరం స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యారు.
గురువారం ఉదయం రాసీ మరణించిన కొద్దిసేపటికే ఆయన సతీమణి కాపెల్లీ ఫెడెరికా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో దిగిన ఫొటోను పంచుకొని 'Forever' అని క్యాప్షన్‌గా పేర్కొంది. అయితే, అతని మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మరణించిన కొద్దిరోజులకే రాసీ మృతిచెందడం ఫుట్‌బాల్ అభిమానులను కలచివేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications