Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2021-22: గోవా చిత్తు.. ముంబై సిటీ బోణీ!

Mumbai City win against FC Goa with 3-0

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) 2021 సీజన్‌లో ముంబై సిటీ బోణీ కొట్టింది. మంగళవారం గోవాలోని ఫటోర్డా మైదానం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై సిటీ 3-0తో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను చిత్తు చేసింది. ముంబై సిటీ తరఫున వెటరన్ ప్లేయర్ ఇగోర్ ఆంగులో (33వ, 36వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. ఇగోర్ క్యాటాటు(76వ నిమిషం) ఓ గోల్ చేశాడు. ఇక గోవా తరఫున ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

గేమ్ ప్రారంభంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో 33వ నిమిషం వరకు ఇరు జట్లు ఖాతా తెరవలేపోయాయి. అయితే 33వ నిమిషంలో లభించిన పెనాల్టీని ముంబై వెటరన్ ప్లేయర్ ఆంగులో గోల్‌గా మలిచి శుభారంభం అందించాడు. ఆ వెంటనే రెండు నిమిషాల వ్యవధిలో మరో గోల్ కొట్టి ముంబై ఆనందాన్ని డబుల్ చేశాడు. జాహోహు ఇచ్చిన పాస్‌ను ఆంగులో గోల్‌గా మలిచాడు. దాంతో ముంబై సిటీ 2-0 ఆధిక్యంతో ఫస్టాఫ్ ముగించింది. సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పూర్తిగా బంతిని తమ నియంత్రణలో ఉంచుకున్న ముంబై.. గోవా గోల్ పోస్ట్‌లోకి పదే పదే దూసుకెళ్లినా.. వారి డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా అడ్డుకుంది.

ఇక 76వ నిమిషంలో గోల్‌కొట్టిన యగోర్ కాటాటు.. ముంబై సిటీ ఆధిక్యాన్ని మూడింతలు చేశాడు. ముంబై సిటీ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న కాటాటు.. ఫస్ట్ మ్యాచ్‌లో గోల్ కొట్టాడు. ఆ తర్వాత తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న ముంబై సిటీ ఘన విజయాన్నందుకుంది.

Story first published: Monday, November 22, 2021, 23:22 [IST]
Other articles published on Nov 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+