Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2021-23: ప్చ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం! చెన్నాయిన్ చేతిలో ఓటమి!

ISL 2021-22: Koman penalty gives Chennaiyin FC nervy win over Hyderabad FC
ISL 2021-22 : Chennaiyin FC Defeats Hyderabad FC హోరాహోరీగా పోరాడినా || Oneindia Telugu

పనాజీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌ఎల్)‌లో మన హైదరాబాద్ జట్టుకు శుభారంభం దక్కలేదు. చెన్నాయిన్‌తో మంగళవారం గోవాలోని బాంబోలిమ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన చెన్నాయిన్ 1-0తో హైదరాబాద్‌ను ఓడించింది. చెన్నాయిన్ తరఫున వ్లాద్‌మిర్ కొమన్(66వ నిమిషం) ఏకైక గోల్ చేయగా.. హైదరాబాద్ ఆటగాళ్లు ఖాతా తెరవలేదు.

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ 0-0తో గోల్స్ లేకుండానే ముగిసింది. సెకండాఫ్‌లోను ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. ఇక హైదరాబాద్ కన్నా కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చి చెన్నాయిన్ పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి దూసుకొచ్చింది. వారిని హైదరాబాద్ డిఫెండర్ల సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే మ్యాచ్ 66వ నిమిషంలో కెప్టెన్ అనిరుధ్ తాపా ఇచ్చిన పాస్‌ను కొమన్ అద్భతంగా గోల్ పోస్ట్‌లోకి కొట్టాడు. దాంతో చెన్నాయిన్ ఖాతా తెరిచింది. అనంతరం మ్యాచ్ ముగిసేవరకు ఆధిక్యాన్ని కాపాడుకొని 1-0తో విజయ లాంఛనం పూర్తి చేసింది. ఈ విజయంతో చెన్నాయిన్ ఖాతాలో రెండు పాయింట్ల చేరాయి.

Story first published: Tuesday, November 23, 2021, 22:44 [IST]
Other articles published on Nov 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+