For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ISL 2021-22: మన హైదరాబాదే చాంపియన్.. ఫైనల్లో కేరళ షూటౌట్!

ISL 2021-22: Hyderabad FC win maiden title after beat Kerala Blasters via penalty shoot-out in Final

ఫట్రోడా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) 8వ సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ చరిత్ర సృష్టించింది. అరంగేట్ర చేసిన మూడో సీజన్‌లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచనాలు నమోదు చేస్తూ దూసుకొచ్చిన నవాబుల జట్టు అత్యంత హోరాహోరీగా సాగిన అంతిమ పోరులోనూ అసాధారణ ఆట చూపెట్టింది. మూడో సారి ఫైనల్ ఆడుతున్న కేరళ బ్లాస్టర్ విసిరిన సవాల్‌ను తమదైన ఆటతో ఛేదించింది. మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 0-1తో ఓటమి అంచుల్లో నిలిచిన దశ నుంచి ఫుంజుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ.. కేరళను షూటౌట్ చేసి తొలి టైటిల్ ముద్దాడింది.

స్కోర్లు సమం అవ్వడంతో..

స్కోర్లు సమం అవ్వడంతో..

ఆదివారం నెహ్రూ స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో హైదరాబాద్‌ పెనాల్టీ షూటౌట్లో 3-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడాయి. బంతి నియంత్రణలో కేరళ (57 శాతం) కాస్త మెరుగ్గా ఉన్నా హైదరాబాద్‌ (43 శాతం) కూడా అంతే దీటుగా ఆడడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. కానీ తొలి అర్ధభాగంలో రెండు జట్లు తమ ప్రయత్నాలను గోల్స్‌గా మలచడంలో సఫలం కాలేకపోయాయి.

ఓటమి దశ నుంచి..

ఓటమి దశ నుంచి..

బ్రేక్ తర్వాత రాహుల్‌ (68వ నిమిషం) చేసిన గోల్‌తో కేరళ ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపు ఆఖరి వరకు కేరళనే ముందంజలో ఉండడంతో ఆ జట్టే గెలిచేలా కనిపించింది. కానీ 88వ నిమిషంలో సాహిల్‌ గోల్‌ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లింది.

గోల్‌ కీపరే హీరో..

గోల్‌ కీపరే హీరో..

పెనాల్టీ షూటౌట్లో హైదరాబాద్‌ పైచేయి సాధించిందంటే గోల్‌కీపర్‌ లక్ష్మీకాంతే ప్రధాన కారణం. కళ్లుచెదిరే డైవ్‌లతో ప్రత్యర్థి ప్రయత్నాలను అడ్డుకున్న అతడు హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. షూటౌట్లో మొదట మార్కో లెస్కోవిచ్‌ (కేరళ) కొట్టిన షాట్‌ను లక్ష్మీకాంత్‌ అడ్డుకోగా.. ఆ తర్వాత షాట్‌ను జావో విక్టర్‌ (హైదరాబాద్‌) గోల్‌ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆపై నిషు (కేరళ), జావియర్‌ (హైదరాబాద్‌) గోల్స్‌ చేయలేకపోయారు.ఆ తర్వాత కేరళ ఆటగాడు ఆయూష్‌ గోల్‌ చేసి స్కోరు సమం చేయగా.. వెంటనే ఖాసా (హైదరాబాద్‌) బంతిని నెట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.

10 స్థానంలో నిలిచిన జట్టు..

10 స్థానంలో నిలిచిన జట్టు..

ఆపై జాక్సన్‌ కొట్టిన షాట్‌ను హైదరాబాద్‌ గోల్‌కీపర్‌ లక్ష్మీకాంత్‌ ఎడమవైపు దూకుతూ ఆపాడు. ఆ వెంటనే హలిచరణ్‌ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంతో షూటౌట్‌లో 3-1తో నెగ్గిన హైదరాబాద్‌ సంబరాల్లో మునిగిపోయింది. మూడోసారి ఫైనల్‌ ఆడిన కేరళకు మళ్లీ నిరాశే మిగిలింది. 2014, 16 టోర్నీల్లోనూ ఫైనల్‌ చేరిన ఆ జట్టు ఏటీకే మోహన్‌బగాన్‌ చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు గత రెండు సీజన్లలో 10, 5 స్థానాల్లో నిలిచిన హైదరాబాద్‌కు ఈసారి కప్‌ గెలవడం పెద్ద ఘనతే.

Story first published: Monday, March 21, 2022, 8:26 [IST]
Other articles published on Mar 21, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+