న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ISL 2020-21: జట్టులో భారీ మార్పులు.. ఈ సారైనా హైదరాబాద్ ఎఫ్‌సీ రాత మారెనా!

 ISL 2020-21: Will team changes change Hyderabad FC’s fortune this season

హైదరాబాద్: తమ తొలి ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) సీజన్‌ (2019-20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. తమ అరంగేట్ర సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశ పరిచింది.

ఈ క్రమంలోనే జట్టులో భారీ మార్పులు చేసిన హైదరాబాద్ ఎఫ్‌సీ తాజా సీజన్‌లో ఒడిశాతో సోమవారం ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్‌ మార్కజ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా కూడా నియమించింది. అలాగే మేనేజర్‌ను, కొంత మంది ఆటగాళ్లను మార్చింది. అన్ని విధాల సిద్దమైన హైదరాబాద్ గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎంతో మంది కోచ్‌లను, మరెందరో ఆటగాళ్లను ఈ నగరం ఫుట్‌బాల్ ప్రపంచానికి పరిచయం చేసింది. 1950-60 కాలం నిజామ్స్ జట్టుకు తిరుగేలేదు. కానీ ఆ దూకుడు తాజా హైదరాబాద్ ఎఫ్‌సీ కొనసాగించలేకపోయింది. కనీసం ఈ సీజన్‌లోనైనా నగర వైభవాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు
గోల్‌ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్‌ దూబే, సుబ్రతా పాల్‌.

డిఫెండర్లు: ఆకాశ్‌ మిశ్రా, ఆశిష్‌ రాయ్, చింగ్లెన్‌సనా సింగ్, డింపిల్‌ భగత్, కిన్‌సైలాంగ్‌ ఖోంగ్సిట్, నిఖిల్‌ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్‌ పన్వార్‌.

మిడ్‌ ఫీల్డర్లు: అభిషేక్‌ హల్దార్, ఆదిల్‌ ఖాన్, సాహిల్‌ తవోరా, హలిచరన్‌ నర్జారీ, హితేశ్‌ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్‌ సస్ట్రే, మార్క్‌ జొతాన్‌పుయా, మొహమ్మద్‌ యాసిర్, నిఖిల్‌ పూజారి, సౌవిక్‌ చక్రవర్తి, స్వీడెన్‌ ఫెర్నాండెస్‌.

ఫార్వర్డ్స్‌: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్‌ డే, జోల్‌ చియానీస్, లాలాంపుయా, లిస్టన్‌ కొలాకో, రోహిత్‌ దను,

హెడ్‌ కోచ్‌: మాన్యుయెల్‌ మార్కజ్‌.

Story first published: Sunday, November 22, 2020, 20:31 [IST]
Other articles published on Nov 22, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X