Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: బెంగళూరుకు షాక్.. జంషెడ్‌పూర్‌కు మూడో విజయం

ISL 2020-21: Stephen Ezes header lifts Jamshedpur FC to win over Bengaluru FC

మార్గో: నైజీరియన్ డిఫెండర్ స్టీఫెన్ ఈజ్(79వ నిమిషం) అద్భుతమైన గోల్ చేయడంతో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో జంషెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్ మూడో విజయాన్నందుకుంది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0తో మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీకి గట్టి షాకిచ్చింది. తాజా విజయంతో 13 పాయింట్లు సాధించిన జంషెడ్‌పూర్ టేబుల్లో మూడో స్థానానికి ఎగబాకగా.. 11 పాయింట్లతో బెంగళూరు నాలుగోస్థానానికి పడిపోయింది.

ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన బెంగళూరుకు మూడో నిమిషంలోనే టార్గెట్ ఛేదించే అవకాశం వచ్చింది. కానీ ఫార్వర్డ్స్ గోల్ చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ సునీల్ ఛెత్రి కొట్టిన అద్భుతమైన షాట్‌ను జంషెడ్‌పూర్ గోలీ సమర్థంగా అడ్డుకున్నాడు. అయితే 17వ నిమిషంలో జంషెడ్ ప్లేయర్ అనికేత్ జాదవ్ కొట్టిన లో షాట్ కూడా గోల్ పోస్ట్ బయట నుంచి వెళ్లింది.

దీంతో స్కోర్ లేకుండానే ఫస్ట్ హాఫ్ ముగిసింది. సెకండ్ హాఫ్‌లో రెండు జట్లు మరింత దూకుడుగా ఆడాయి. చివరి నిమిషంలో సమన్వయంతో కదిలిన జంషెడ్‌పూర్ ప్లేయర్ ఈజ్ ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ గోల్ చేశాడు.

Story first published: Tuesday, December 29, 2020, 8:40 [IST]
Other articles published on Dec 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+