For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISL 2021: ప్చ్.. సెల్ఫ్ గోల్‌తో చెన్నయిన్ ఎఫ్‌సీ ఓటమి!

ISL 2020-21: Sipovic Own Goal Gives Jamshedpur 1-0 Win against Chennaiyin FC

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో జంషెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్ మరో విజయాన్ని నమోదు చేసింది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0తో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆఖరి క్షణం వరకు ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేకపోయాయి. కానీ మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నయిన్ సెల్ఫ్ గోల్‌తో జంషెడ్‌పూర్‌ను గెలిపించింది.

టాస్ గెలిచి జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ సీజన్‌లో నిలకడలేమి ప్రదర్శనను కనబర్చిన ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా కదలడంతో ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. సెకండాఫ్‌లో కూడా ఇరు జట్లు ప్రత్యర్థి గోల్స్ పోస్టులపై దాడికి దిగినా గోల్స్ నమోదు చేయలేకపోయారు.

ఈ క్రమంలో నిర్ణీత సమయం ముగుస్తుందనగా చెన్నయిన్ ఎఫ్‌సీ డిఫెండర్ ఎనెస్ సిపోవిక్ సొంత గోల్ పోస్టులోకి బంతిని పంపాడు. చెన్నయిన్ చేసిన ఓన్ గోల్‌తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రిఫరీ మ్యాచ్ ముగిసిందని ప్రకటించడంతో జంషెడ్‌పూర్ విజయం ఖాయమైంది.

ఈ గెలుపుతో జంషెడ్‌పూర్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 21 పాయింట్లతో ఆ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. 17 పాయింట్లతో చెన్నయిన్ ఎనిమిదో ప్లేస్‌లో ఉంది.

Story first published: Thursday, February 11, 2021, 8:43 [IST]
Other articles published on Feb 11, 2021
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+