Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: బెంగళూరుకు మళ్లీ షాకిచ్చిన ఏటీకే

ISL 2020-21: Sensational ATK Mohun Bagan Beat Bengaluru FC by 2-0

వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో ఏటీకే మోహన్ బగాన్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండోసారి బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు షాకిచ్చింది. మంగళవారం ఫటోర్డా స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 2-0తో తేడాతో బెంగళూరు ఎఫ్‌సీని ఓడించింది. రాయ్ కృష్ణ(37వ నిమిషం), మర్సెలో పెరీరా(44వ నిమిషం) ఏటీకేకు గోల్స్ అందించారు. నిర్ణీత సమయంలో బెంగళూరు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు.

టాస్ గెలిచిన బెంగళూరు సిటీ బంతిని కిక్ చేయడానికి నిర్ణయించుకున్నది. ఫస్టాఫ్‌లో బంతి బెంగళూరు నియంత్రణలోనే ఉన్నది. అయితే గోల్స్ చేయడంలో మాత్రం ఆ జట్టు ఆటగాళ్లు విఫలమయ్యారు. సరైన్ పాస్‌లు ఇచ్చుకుంటూ ఏటీకే మోహన్ క్లబ్ దీటుగా జావాబిచ్చింది. ఈ క్రమంలో మోహన్ బగాన్ క్లబ్‌కు 37వ నిమిషంలో పెనాల్టీ లభించింది. కెప్టెన్ రాయ్ కృష్ణ ఎలాంటి తప్పు చేయకుండా పెనాల్టీని గోల్‌గా మార్చాడు. 44వ నిమిషంలో మార్సెలో పెరీరా గోల్ చేయడంతో మోహన్ బగాన్ లీడ్ 2-0తో డబుల్ అయింది.

సెకండాఫ్‌లో సునీల్ చెత్రీ గోల్ కోసం చేసిన ప్రయత్నాన్ని ఏటీకే కీపర్ అద్బుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దాంతో ఏటీకే విజయం లాంచనమైంది. కాగా ఈ విజయంతో ఏటీకే(33 పాయింట్లు) టేబుల్లో రెండో ప్లేస్‌కు చేరింది. ఇక ఆరోస్థానంలో నిలిచిన బెంగళూరు ప్లే ఆఫ్ చాన్స్‌లను మరింత టఫ్ చేసుకుంది.

Story first published: Wednesday, February 10, 2021, 8:33 [IST]
Other articles published on Feb 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+