
వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. చివరి ఐదు నిమిషాల్లో స్ట్రయికర్లు అద్భుతం చేయడంతో బెంగళూరుతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఓటమి తప్పించుకుంది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. బెంగళూరు తరఫున సునీల్ చెత్రీ(6వ నిమిషం), లియో అగస్టిన్(61వ నిమిషం).. హైదరాబాద్ తరఫున అందేన్ శాంటానా(86వ నిమిషం), ఫ్రాన్ శాండజ(90వ నిమిషం) గోల్స్ చేశారు.
కెప్టెన్ సునీల్ చెత్రీ(6వ నిమిషం) అందించిన గోల్‌తో మ్యాచ్ ధాటిగా మొదలుపెట్టిన బెంగళూరు ఫస్టాఫ్‌ను 1-0తో ముగించింది. అనంతరం లియో అగస్టిన్(61వ నిమిషం) మరో గోల్ చేయడంతో 2-0తో డబుల్ లీడ్‌లోకి వెళ్లిన బెంగళూరు మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే 86వ నిమిషంలో హైదరాబాద్‌కు గోల్ అందించిన అందేన్ శాంటానా బెంగళూరు ఆధిక్యాన్ని తగ్గించాడు.
నాలుగు నిమిషాల తర్వాత ఫ్రాన్ శాండజ(90వ నిమిషం) గోల్ సాధించడంతో స్కోర్లు 2-2తో సమం అయ్యాయి. ఇంజ్యురీ టైమ్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరుసగా నాలుగో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పాయింట్స్ టేబుల్‌లో ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. బెంగళూరు ఏడో స్థానంలో ఉంది.