Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: ఈస్ట్ బెంగాల్‌కు షాక్.. ఏటీకే మోహన్ బగాన్ సూపర్ విక్టరీ

ISL 2020-21: Roy Krishna and Manvir Singh Help ATK Mohun Bagan Beat SC East Bengal 2-0

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో ఏటీకే మోహన బగాన్ ఫుట్ క్లబ్ జోరు కొనసాగుతుంది. కోల్‌కతాకే చెందిన ఈస్ట్ బెంగాల్‌కు ఏటీకే గట్టిషాక్ ఇచ్చింది. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకొని టేబుల్ టాపర్‌గా నిలిచింది. తిలక్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన పోరులో ఏటీకే మోహన్ బగాన్ 2-0తో బెంగాల్‌ను ఓడించింది. రాయ్ కృష్ణ(49వ నిమిషం), మన్వీర్ సింగ్(85వ నిమిషం)లో గోల్స్ చేసి ఏటీకేకు అద్భుత విజయాన్నందించారు. ఇది ఆ జట్టుకు రెండో విజయం కాగా.. ఫస్ట్ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది.

ఆసియాలోనే ఈ కోల్‌కతా జట్ల మధ్య పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. దాంతో రెండు జట్లు కాస్త రక్షణాత్మక ధోరణిలో ఆడాయి. మ్యాచ్ సాగుతున్నా కొద్ది హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధ భాగంలో గోల్స్‌ నమోదు కాలేదు. విజయం కోసం గట్టిగా ప్రయత్నించిన జట్లు గోల్స్‌ చేసే అవకాశాలను తృటిలో చేజార్చుకున్నాయి. అయితే రెండో అర్ధ భాగంలో జోరు పెంచిన మోహన్‌ బగాన్‌ ఫలితం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి మంచి దూకుడు మీద కనిపించిన ఫార్వర్డ్‌ రాయ్ కృష్ణ సెకండాఫ్ ఆరంభంలోనే గోల్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఆ జట్టు ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టింది. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఇక గేమ్ చివరి దశకు చేరుకున్న క్రమంలో మన్వీర్ సింగ్ గోల్ చేయడంతో ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేసుకొని గెలుపును ఖాయం చేసుకుంది. మరోవైపు ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈస్ట్ బెంగాల్ తమ అభిమానులకు నిరాశనే మిగిల్చింది.

Story first published: Friday, November 27, 2020, 22:43 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+