
గోవా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌ను ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ విజయంతో ముగించింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించింది. శనివారం ఏకంగా 11 గోల్స్ నమోదైన పోరులో ఒడిశా 6-5తో ఈస్ట్ బెంగాల్‌ను ఓడించింది. సెకండాఫ్‌లో 20 నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్‌తో చెలరేగిన ఒడిశా ప్రత్యర్థిపై పై చేయి సాధించింది. ఒడిశా తరఫున పాల్ రమ్ ఫాంజువా (49,65వ నిమిషాల్లో) జెర్రీ మవిమింగ్తంగ (51, 67వ నిమిషాల్లో) చెరో రెండు గోల్స్ కొట్టగా.. సైలుంగ్(33వ నిమిషం), మారిసియో(69వ నిమిషం) చెరో గోల్ సాధించారు.
ఈస్ట్ బెంగాల్ జట్టులో ఆరోన్ (59, 90+5 నిమిషాల్లో) రెండు గోల్స్ రాబట్టాడు. జెజే(74 నిమిషం) ఓ గోల్ కొట్టాడు. ఒడిశా కీపర్ రవికుమార్ చేసిన సెల్ఫ్ గోల్‌తో ఈస్ట్ బెంగాల్‌కు ఇంకో గోల్ వచ్చింది. డీహెచ్‌ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు డియాగో మారికో, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పాల్‌కు లభించింది. ఓవరాల్‌గా 20 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, 12 ఓటములు, 6 డ్రాలతో 12 పాయింట్లు సాధించిన ఒడిశా ఆఖరి ప్లేస్‌తో లీగ్‌ను ముంగించింది. ఈస్ట్ బెంగాల్ (3 విజయాలు, 9 ఓటములు, 8డ్రాలు) 17 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.