Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: ఈస్ట్ బెంగాల్ చిత్తు.. నార్త్ ఈస్ట్ గెలుపు!

ISL 2020-21: NorthEast United FC Continue Unbeaten Run with 2-0 Win against SC East Bengal

వాస్కో (గోవా): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌లో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టు రెండో విజయం సాధించింది. ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ 2-0 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఫస్టాఫ్ 33వ నిమిషంలో ఈస్ట్‌ బెంగాల్‌ ప్లేయర్‌ సుర్‌చంద్ర సింగ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేయడంతో నార్త్‌ ఈస్ట్‌ జట్టు ఖాతా తెరిచింది. ఆ తర్వాత స్కోర్ సమం చేసేందుకు ఈస్ట్ బెంగాల్ అనేక ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది.

అటువైపు యునైటెడ్ టీమ్ కూడా సెకండాఫ్ పూర్తయ్యే వరకూ ఇంకో గోల్ సాధించలేకపోయింది. అయితే ఇంజ్యూరీ టైమ్ మొదలైన వెంటనే(90వ నిమిషం) రైట్ ఫ్లాంక్ నుంచి సుహైర్ ఇచ్చిన లాంగ్ పాస్ అందుకున్న రొచార్జెలా గోల్ కొట్టి నార్త్ ఈస్ట్‌కు ఘన విజయం అందించాడు.

ఓవరాల్‌గా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు డ్రా సాధించిన ఆ టీమ్ 8 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌కు దూసుకెళ్లగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈస్ట్ బెంగాల్ చివరి ప్లేస్‌లో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబైతో ఒడిశా... గోవాతో కేరళ బ్లాస్టర్స్‌ తలపడతాయి.

Story first published: Sunday, December 6, 2020, 9:11 [IST]
Other articles published on Dec 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+