ISL 2020-21: ఏటీకే మోహన్ బగాన్‌కు నార్త్‌ఈస్ట్ యునైటెడ్ షాక్!

గోవా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న ఏటీకే మోహన్ బగాన్ జట్టుకు నార్త్‌ఈస్ట్ యునైటెడ్ షాకిచ్చింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ 2-1తో ఏటీకే మోహన్ బగాన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫస్టాఫ్‌లో ఇరు జట్లూ ఖతా తెరవలేకపోయాయి.
సెకండాఫ్‌లో అటాకింగ్ గేమ్ నడవగా.. 60వ నిమిషంలో లూయిస్ మచాడో నార్త్‌ఈస్ట్‌కు ఫస్ట్ గోల్ అందించాడు. అయితే, కొద్దిసేపటికే స్టార్ ప్లేయర్ రాయ్ కృష్ణ(72వ నిమిషం) కొట్టిన గోల్‌తో ఏటీకే స్కోర్‌ను సమం చేసింది. కానీ, 81వ నిమిషంలో ఫెడెరికో గలేగో నార్త్ఈస్ట్‌కు విన్నింగ్ గోల్ అందించాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా.. స్కోర్ సమం చేయలేకపోయిన ఏటీకే ఓడిపోయింది. లీగ్‌లో నాలుగో విజయంతో నార్త్ఈస్ట్ ఐదో ప్లేస్‌కు దూసుకురాగా.. ఏటీకే సెకండ్ ప్లేస్‌లో ఉంది.
Story first published: Wednesday, January 27, 2021, 8:09 [IST]
Other articles published on Jan 27, 2021
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications